Movie News

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి, రామబాణం లాంటి సినిమాల్లో నటించిన ఆమెకు కోరుకున్న విజయం దక్కలేదు.. అంతకుముందు గల్ఫ్, దేవి-2 లాంటి చిత్రాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఐతే ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్‌తో పాపులారిటీ వచ్చాక డింపుల్‌కు అవకాశాలైతే బాగానే వస్తున్నాయి. 

తన పేరు, లుక్స్ చూస్తే పరభాషా కథానాయిక అనుకుంటాం కానీ.. ఆమె అచ్చమైన తెలుగమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమెకు పెద్ద ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న సంగతి కూడా బయటపెట్టలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సంగతే వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది డింపుల్.

లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావుకు డింపుల్ హయతి మనవరాలు అవుతుందట. ఇంకో విశేషం ఏంటంటే.. పాత తరం నటి ప్రభ.. డింపుల్‌కు స్వయంగా నానమ్మ అట. ఇంకా తన ఫ్యామిలీలో చాలామంది నటులు ఉన్నట్లు ఆమె వెల్లడించింది.

ఐతే బ్యాగ్రౌండ్ చూపించి కాకుండా.. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే డింపుల్ ఇన్ని రోజులు ఈ విషయాలను బయట పెట్టలేదని అనిపిస్తోంది. బహుశా ఇండస్ట్రీ జనాలకు కొంతమేర తన బ్యాగ్రౌండ్ గురించి తెలిసి ఉండొచ్చు. 

డింపుల్ సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయే అయినప్పటికీ.. ఆమె సినీ రంగంలోకి వస్తానంటే వద్దనే అన్నారట కుటుంబ సభ్యులు. కానీ తన ఆసక్తి చూసి తర్వాత తనకు వాళ్లందరూ సపోర్ట్ చేసినట్లు ఆమె వెల్లడించింది.

గ్లామర్ తారగా గుర్తింపు సంపాదించిన డింపుల్.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లోనూ సూపర్ సెక్సీగా కనిపిస్తోంది. అంతే కాక ఈ చిత్రం నటిగానూ తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ మంగళవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 11, 2026 6:01 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

20 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago