స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును సిఐడి అధికారులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ పై ఉన్నారు. అయితే, చంద్రబాబు వయసు, ఆరోగ్యం రీత్యా ఆయనకు రెగ్యులర్ బెయిల్ లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసిబి కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు 53 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. చంద్రబాబు అనారోగ్య సమస్యల రీత్యా ఆయనకు నాలుగు వారాలపాటు కండిషనల్ బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. దాదాపు రెండు నెలల నిరీక్షణ తర్వాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించగా సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టిడిపి నేతలు కార్యకర్తలు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates