మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. తాజాగా మరోసారి టాక్ ఆఫది టౌన్ అన్నట్టుగా వార్తల్లోకి ఎక్కారు. టీడీపీతో రాజకీయ ఓనమాలు ప్రారంభించిన మోత్కుపల్లి.. గతంలో కమ్యూనిస్టుల ఉద్యమాల్లోనూ పాల్గొన్న చరిత్రను సొంతం చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్‌లో ఏనాడూ… వివాదం కాని మోత్కుపల్లి.. మూడున్నరేళ్ల కిందట తొలిసారి వివాదానికి కేంద్రంగా మారారు.
ఆ వివాదం దరిమిలా.. ఆయన సాధించింది ఏమీ లేకపోయినా.. మీడియా అటెన్షన్‌ను మాత్రం పొందారు. ఇక, ఇప్పుడు కూడా అదే వివాదం రిపీట్. కానీ, అప్పట్లో మాదిరిగా ఇప్పుడు నేరుగా నోరు పారేసుకోకున్నా.. మనోభీష్ఠం నెరవేరని కారణంగానే ఇలా.. మోత్కుపల్లి రాజకీయ రచ్చకు కేంద్రంగా మారుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో కొనసాగుతోంది. అయితే.. ఆదిలో వచ్చిన సింపతీ.. ఇప్పుడు రాకపోవడం మోత్కుపల్లి పొలిటికల్ హిస్టరీలో మైనస్సేనని చెప్పాలి.
టీడీపీలో ఉండగా.. చంద్రబాబు తనకు గవర్నర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని.. కానీ, తనను పట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ.. మోత్కుపల్లి అప్పట్లో రచ్చ చేశారు. దీనికి కాస్త ఎస్సీల రంగు కూడా పూశారు. బాబుకు ఎస్సీలంటే గిట్టదని అందుకే తనను పక్కన పెట్టారని సెంటిమెంటు ను రాజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఇదేసమయంలో బీఆర్ఎస్ లో చేరే ప్రయత్నంలో ఉన్న ఆయన… కేసీఆర్ రాజులకే రాజు అని… ఎస్సీలకు మహరాజు అని కొనియాడారు.
తర్వాత కొన్నాళ్లకు కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తన మనోభీష్ఠమైన… గవర్నర్ గిరి కాకపోయినా.. తత్సమానమైన నామినేటెడ్ హోదా అయినా ఏదో ఒక దక్కక పోదా? అని ఎదురు చూపులు చూశారు. కానీ, ఆయన ఎదురు చూపులు ఫలించలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ అదే రాజులకు రాజైన కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ.. మోత్కుపల్లి అనే ఔట్ డేటెడ్ నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు దూసుకువెళ్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్న మోత్కుపల్లి.. ఇటీవల తన తమ్ముడని… తానేనాడూ ఆయనను విమర్శించలేదని చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నం అయితే.. గట్టిగానే చేస్తున్నారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇక్కడైనా.. మోత్కుపల్లి వారి మనోభీష్ఠం నెరవేరుతుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 9:51 pm
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణ యించుకున్నట్టు తెలిసింది. తద్వారా.. ఆది నుంచి…