స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం టీడీపీతో కలిసి సాగుతామని పొత్తు ప్రకటన చేసిన తర్వాత మళ్లీ పవన్ కనిపించడం లేదనే చెప్పాలి. బాబు అరెస్టు, రిమాండ్, హైకోర్టులో పిటిషన్ కొట్టివేత, రిమాండ్ పొడిగింపు తదితర పరిణామాలు చోటు చేసుకుంటున్నా పవన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు విషయం తెలియగానే విజయవాడ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని హడావుడి చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై విమర్శలు చేశారు.
జైల్లో బాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడేమో ఏమీ పట్టనట్లు ఉండిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నట్లు తెలుస్తోంది.
జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు విషయం బీజేపీకి చెప్పకుండా పవన్ ప్రకటించడంపై బీజేపీ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు టీడీపీతో పొత్తు ప్రకటన సందర్భంగా పవన్ అన్నారు.
మరోవైపు తమను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాపు సంఘాలు కూడా పవన్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. అందుకే ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యారని చెబుతున్నారు.
This post was last modified on September 25, 2023 6:22 pm
వైసీపీ అధినేత జగన్ మరింత బద్నాం అవుతున్నారా? ఆయన చేస్తున్న పనులపై కూటమి సర్కారు ప్రజల్లో ప్రచారం చేస్తోందా ?…
ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. రాజకీయ పరిష్వంగాన్ని వదిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న…
తెలుగు ప్రేక్షకులకు కార్తీ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ. అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించి అక్కడి…
మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండే హీరో.. మోహన్ లాల్. ఆ ఇండస్ట్రీలో కలెక్షన్ల రికార్డుల్లో చాలా…
తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను…
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…