టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, తదనంతరం రిమాండు.. అంశాలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఇవే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంచలనం కాగా, ఇప్పుడు చంద్రబాబును అర్థరాత్రి రాజమండ్రి జైలుకు తరలించడం.. ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా వాదనలు వంటివి.. జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
అంతేకాదు.. అసలు స్కిల్ డెవలప్‌మెంటు కేసు పూర్వాపరాలు సహా.. అసలు ఏం జరిగింది? అనే అంశాల పైనా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అదేసమయంలో 73 ఏళ్ల వయసులో దేశంలో తొలిసారి ఒక మాజీ సీఎంను అరెస్టు చేశారంటూ హిందూ పత్రిక వ్యాసం ప్రచురించగా, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పత్రికలు కూడా.. ప్రముఖంగా చంద్రబాబు కథనాన్ని తొలి పేజీలోనే ప్రచురించాయి. అయితే, ఏం జరిగింది? అనే విషయంపై మాత్రం చాలా ఆచితూచి వ్యవహరించడం గమనార్హం.
కొన్ని పొరుగు రాష్ట్రాల పత్రికల్లోనూ చంద్రబాబు అరెస్టును నాటి తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అరెస్టును తలపించేలా జరిగిందని పేర్కొనడం విశేషం. అయితే.. రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీనిని కొన్ని పత్రికలు పేర్కొనగా… ఏం జరిగిందనేది ఆసక్తిగా మారిందని మరికొన్ని పత్రికలు పత్రికలు పేర్కొన్నాయి. ఏదేమైనా అన్ని రాష్ట్రాల ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో చంద్రబాబు అరెస్టు, రిమాండు వార్త ప్రముఖంగా రావడం గమనార్హం.
ఇక, అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. ముఖ్యంగా ‘ది సింగపూర్ టైమ్స్’, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు చంద్రబాబు అరెస్టు సహా.. ఆయనకు ఉన్న ఇమేజ్, అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన పాత్ర వంటివి ప్రధానంగా స్పృశించాయి. మొత్తంగా స్థానిక మీడియా కంటే కూడా.. భారీ ఎత్తున అంతర్జాతీయ, జాతీయ మీడియాలు సైతం చంద్రబాబువార్తకు ప్రాధాన్యం ఇచ్చాయి.
This post was last modified on September 11, 2023 12:59 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…