లోకల్ లీడర్లపై ఫోకస్ పెట్టిందా ?

బీజేపీ రూటుమార్చినట్లుంది. రాష్ట్రస్ధాయి నేతలపైన కాకుండా లోకల్ లీడర్లపైన చూపు తిప్పినట్లుంది. నియోజకవర్గాల్లో బలంగా ఉండే ద్వితీయశ్రేణి నేతలను పార్టీలో చేర్చుకుంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాదులు అనుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ రాష్ట్రస్ధాయి నేతలు పార్టీలో చేరటంపై పెద్దగా మొగ్గు చూపటంలేదు. అలాంటపుడు వాళ్ళకోసం వెయిట్ చేయటం, గాలమేస్తు కాలాన్ని వేస్టుచేసుకోవటం ఎందుకని అనుకున్నారట. అందుకనే వివిధ నియోజకవర్గాల్లో మండలస్ధాయిలో గట్టి లీడర్లుగా పేరున్న వాళ్ళని చేర్చుకోవటంపైన ఫోకస్ పెట్టారట.

నేతల జాయినింగ్స్ కమిటి ఛైర్మన్ గా ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే చెప్పుకోదగ్గ స్ధాయి నేతలను పార్టీలో చేర్చిన దాఖలాలు లేవు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత నుండి బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలెవరు చేరలేదు. అందుకనే కమిటి ఫెయిలైందనే చెప్పాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ లో చాలామంది నేతలు చేరారు. చేరటానికి రెడీగా ఉన్నారు. సో ఇదంతా చూసిన తర్వాత రాష్ట్రస్ధాయి నేతలను చేర్చుకోవటంపై ప్రయత్నాలు చేయటం అనవసరమని అనుకున్నట్లున్నారు.

ఇదే విషయమై ఈటల మాట్లాడుతు అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా జాయినింగ్స్ పై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను బహిరంగసభలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈటల ప్రకటనపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే బీజేపీలో చేరటానికి ఎవరు ఇష్టపడకపోతే ఇక అసెంబ్లీ నియోజకవర్గాల స్ధాయిలో చేరటానికి ఎవరు ఇష్టపడతారు అనే చర్చ మొదలైంది.

విచిత్రం ఏమిటంటే అభ్యర్ధుల ప్రకటన కేసీయార్ చేయగానే పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. టికెట్లు రాని ఏడుమంది సిట్టింగులతో పాటు టికెట్లు దక్కని ఆశావహుల్లో చాలామంది కేసీయార్ పై మండిపోతున్నారు. వీళ్ళల్లో కూడా కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకానీ బీజేపీ వైపు ఎవరూ చూడలేదు. దీంతోనే కమలనాదుల్లో క్లారిటి వచ్చేసింది తమవైపు పెద్ద నేతలు ఎవరు రావటంలేదని. అందుకనే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ మొదటిజాబితా కోసం ఎదురుచూస్తోంది. మరి బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుటవుతుదో చూడాల్సిందే.