వీధికుక్కలు కూడా భయపడవు: విజయసాయి రెడ్డి!

రాజకీయాల్లో విజేతలకు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయినవారు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగ్‌లు ఇస్తే వీధికుక్కలు కూడా భయపడవని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.

వివిధ జాతీయ సర్వేలలో వైసీపీ గెలుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే దీనిపై పచ్చమీడియా సొంత కథనాలు వండీవారుస్తోందని విజయసాయి నిప్పులు చెరిగారు.

ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ పచ్చ మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని, మరి ఇండియా టుడే టీవీ సర్వే మాత్రమే అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందని పేర్కొన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితేనే ఒరిజినల్, లేకపోతే ఫేకా? అని ఆయన ప్రశ్నించారు.

పరాజితులు, ఒకప్పటి రౌడీ షీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని విమర్శలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమా తెలుగుదేశం పార్టీలో ఒక్కడికీ లేదన్నారు.