రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ..ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తండ్రి ఓ వైపు, కొడుకు ఓ వైపు, దత్త పుత్రుడు ఓ వైపు అన్నట్లు..ఏపీ మొత్తం యాత్రలు చేసేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఆయన ప్రస్తుతం విజయవాడలో యాత్ర నిర్వహిస్తున్నారు. చెప్పాలంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి పట్టు ఉంది. ఇది టీడీపీకి ప్లస్ అనే చెప్పవచ్చు. యువనేతకు మద్దతిస్తూ యువతీ యువకులు రోడ్ల పైకి తరలి వస్తున్నారు.
అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజలు లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు మోయ లేని విధంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తారు.
మరికొద్ది రోజుల్లోనే చంద్రన్న ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిస్కరిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇసుక అందుబాటులేక అవస్థలు పడుతున్నామన్న నగరవాసులు తెలిపారు లోకేష్.
భవిష్యత్తుకు గ్యారంటీ కర పత్రాలను ప్రజలకు పంచుతూ వాటి ప్రయోజనాలను వివరిస్తున్నారు లోకేష్. యువనేతను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడుతున్న యువతీయువకులు, మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లతో ఫోటోలు దిగారు. రోడ్డు డివైడర్లు, భవనాలపైకి ఎక్కి యువనేతకు అభివాదం చెబుతున్న నగర ప్రజలను చెయ్యి ఊపి పలకరిస్తూ ముందుకు వెళ్తున్నరు నారా లోకేష్.
Gulte Telugu Telugu Political and Movie News Updates