దివంగత వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం రాజకీయ పరంగానూ చర్చకు దారి తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతలా అంటే ఈ పెళ్లితో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అసలు సంగతి ఏమిటీ అంటే?
నరసాపురానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. జక్కం బాబ్జి, అమ్మాని దంపతుల రెండో అమ్మాయి పుష్పవల్లి.. రాధాకు భార్య కాబోతున్నారు. ఈ కుటుంబానికి రాజకీయంగా మంచి పేరే ఉంది. రాధాకు కాబోయే అత్త 1987లో టీడీపీ నుంచి నరసాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా పని చేశారు.
కానీ ఇప్పుడు రాధా మామగారి కుటుంబం జనసేనలో యాక్టివ్గా ఉంది. ఇటీవల ఉభయ గోదావవరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ వీళ్ల ఇంట్లోనే బస చేశారు. మరోవైపు వంగవీటి రంగా జయంతి సందర్భంగా రాధా కూడా బాబ్జి నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాధా జనసేనతోనూ కలిసి తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిక కాబోయే మామ జనసేనలోనే ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత రాధా కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయనే చర్చ ఊపందుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates