ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అదేసమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా.. ఏపీ విపక్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖలో అనేక విష యాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా విపక్షాల సమావేశాలు, రోడ్ షోలకు అనుమతించకపోవడం.. అనుమతి ఇచ్చినా.. వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించి.. దాడులు చేయించడం వంటివిషయాలను ఆయన పేర్కొన్నారు.
ఇటీవల పుంగనూరులో జరిగిన దారుణాన్ని చంద్రబాబు పూస గుచ్చినట్టు వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పుంగనూరులో తనను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలను రంగంలోకి దింపారని.. రాష్ట్రంలో ఇప్పుడు తాను లేకపోతే.. ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారు ఉండరనే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడులను ప్రేరేపిస్తోందని చంద్రబాబు వివరించారు. మొత్తం 40 మంది వరకు టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు జరిపిన లాఠీ చార్జీలోనూ.. వైసీపీ మూకలు జరిపిన రాళ్ల దాడిలోనూ గాయపడ్డారని వివరించారు.
అదేసమయంలో వాహనాలకు కూడా నిప్పు పెట్టారని అన్నారు. విశాఖలోనూ ప్రతిపక్షాలు పర్యటించేందు కు అనేక ఆంక్షలు పెడుతున్నారని.. ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న నగరంలో ఎవరైనా తిరిగే స్వేచ్ఛ ఉంద ని.. కానీ, నిరంకుశ పాలనతో ప్రాథమిక హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం మొగ్గలోనే తుంచేస్తోం దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులను అధికార పార్టీ నాయకులు దోచేసుకుంటు న్నారని.. వీటిని ప్రశ్నిస్తున్న తమపైనే దాడులు చేసి అంతం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగా రు.
రాష్ట్రంలో విధ్వంసకర పాలననుకట్టడి చేసేందుకు.. రాష్ట్రపతి తన విశేష అధికారాలను వినియోగించుకో వాలని.. కుదిరితే రాష్ట్రపతి పాలన విధించేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి కూడా ఏపీలో జరుగుతున్న విషయాలపై స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడులు.. పలమనేరు ఘటనలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీ తాలూకు ఫొటోలను చంద్రబాబు ఈ లేఖకు జతపరిచినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates