పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్ని పరిణామాలు జరుగుతున్నా మౌనంగా ఉంటూ వచ్చిన మాజీ భార్య రేణు దేశాయ్ ఇవాళ ఒక వీడియో రూపంలో బహిరంగంగా మద్దతు తెలపడం ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతోంది. డబ్బుపై ఆశ లేకుండా ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం అవసరమని, అందుకే జనసేనకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పడమే కాక వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి అవకాశం ఇమ్మని అడగడం కూడా జరిగింది. మా పిల్లలే కాదు ఎవరి పర్సనల్ లైఫ్ జోలికి వెళ్లడం కరెక్ట్ కాదని సూచించడం వైరల్ అవుతోంది.
విడాకులు తీసుకున్న తర్వాత ఇన్నేళ్లలో రేణు దేశాయి పలు సందర్భాల్లో మీడియాలో వచ్చినా తన గతం గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఒకటి రెండు సార్లు జరిగినా కొన్ని మాటలకు అర్థాలను కొందరు నెటిజెన్లు పక్కదారి పట్టించడంతో దాని గురించి అవసరం లేని ఆన్ లైన్ డిబేట్ ఫ్యాన్స్ మధ్య జరిగింది దంపతులుగా. పూర్తిగా విడిపోయినా అకీరానందన్ ను ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంచుతున్న రేణు దేశాయ్ మొదటి రోజు సినిమాలకు వెళ్తున్నా నో చెప్పడం లేదు. ఇటీవలే బ్రో కోసం క్రాస్ రోడ్స్ కు వచ్చిన అకీరాను చుట్టుముట్టి ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఇదిలా ఉండగా రాజకీయ వేడి బాగా ఉన్న టైంలో రేణు అన్న మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిమిషాల వ్యవధిలో అప్పుడే వైసిపి మంత్రులు ట్వీట్ల రెస్పాన్స్ మొదలుపెట్టారు. అంబటి రాంబాబు ఆవిడను ఉద్దేశించి సినిమాల్లో తమ పాత్రలను పెట్టకుండా పవన్ కు చెప్పమని సలహా ఇవ్వడం జరిగిపోయింది. మొన్న అన్నయ్య, ఇప్పుడు మాజీ సతీమణి ఇలా డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్ గానో జనసేనకు సానుకూలంగా ఈ పరిణామాలు జరగడం కార్యకర్తలకు పాజిటివ్ గా అనిపిస్తోంది. ఈ లెక్కన రేణు దేశాయ్ కి సైతం అక్కర్లేని రివర్స్ కౌంటర్లు, విచిత్ర దూషణలు తప్పవేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates