టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు.
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్ర స్థాయిలో నిర్మాణం చేపట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ను ఎలా నిర్మించారు? 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు? అంటూ మూడు ప్రశ్నలు వేశారు. ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు అన్నారు.
ఇదిలా ఉంటే అంబటి రాంబాబు ప్రశ్నలకు నెటిజన్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు సంగతి పక్కన పెడితే మీరేప్పుడు పోలవరం పూర్తి చేస్తారో చెప్పండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం పోలవరం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు.