ఐవైఆర్‌.. మ‌ళ్లీ ఏసేశాడుగా.. వైసీపీ ఏం చేస్తుందో!

ఐవైఆర్ కృష్ణారావు గుర్తున్నారా? ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చంద్ర‌బాబు హ‌యాంలో ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత‌.. రిటైర‌య్యారు. అనంత‌రం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు స‌ర్కారుపైనే విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో ఆయ‌న‌ను అప్పటిక‌ప్పుడు ప‌క్క‌న పెట్టారు. త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు. ఇక‌, త‌ర‌చుగా ఏపీ స‌ర్కారుపై హైద‌రాబాద్‌లో ఉండి విమ‌ర్శ‌లు గుప్పి స్తూ ఉన్నారు.

ఇప్పుడు చాన్నాళ్ల త‌ర్వాత‌.. ఐవైఆర్ స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వం తాజాగా చేప‌ట్టిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి నియామ‌కం విష‌యంపై ఆయ‌న రియాక్ట్ అయ్యారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిని నియ‌మిస్తూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణ‌యాన్నిత‌ప్పుబడుతూ.. ఐవైఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అచంచ‌ల విశ్వాసం ఉన్న‌వారినే చైర్మ‌న్ గా నియ‌మించాలి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం స‌రైంది కాదు. హిందూ ధ‌ర్మ సంస్థ‌లు, ధార్మిక సంస్థ‌ల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ అన‌ర‌నే అడ్డుకునేవారు లేర‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది” అని ఐవైఆర్ విరుచుకుప‌డ్డారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.