విశాఖపట్నంలోని రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయం రెడీ అవుతోంది. క్యాంపు ఆపీసు భవనాల నిర్మాణం అయిపోయింది. ఇంటీరియర్ వ్యవహారాలే జరుగుతున్నాయి. ఇవికూడా మరో నెలరోజుల్లో పూర్తయిపోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇంటీరియర్ పనులు కూడా పూర్తయిపోతే వెంటనే జగన్మోహన్ రెడ్డి తన మకాంను విశాఖపట్నంకు మార్చేయటానికి రెడీగా ఉన్నారు. అన్నీ కలిసొస్తే అక్టోబర్ 24వ తేదీకి జగన్ విశాఖకు కుటుంబంతో పాటు తరలిపోవటం ఖాయమట. దీనిక సమీపంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు కూడా నివాసలు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే భద్రతాపరమైన సమీక్షలను జగన్ చేశారు. ముఖ్యమంత్రి నివాసముండే రోడ్డులోను ఇంటికి చుట్టుపక్కల ఏపీఎస్పీ బెటాలియన్ ఔట్ పోస్టు ఏర్పాటుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ నుండి వైజాగ్ లోనే తాను కాపురం ఉండబోతున్నట్లు గతంలోనే జగన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ జరుగుతున్న పనులు, సమీక్షలు చూస్తుంటే రాబోయే దసరా పండుగ సందర్భంగానే జగన్ విశాఖకు మారిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.
ప్రస్తుతం సీఎంవో కు సమీపంలోనే ఒక అపార్ట్ మెంట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీన్నే సీఎంవో ఉన్నతాధికారులకోసం తీసుకుంటున్నారు. దీని నిర్మాణపనులను కూడా జగన్ సమీక్షించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరంలో కొన్ని ప్రిస్టేజియస్ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారభించింది. వీటన్నింటినీ ఎన్నికల్లోపు పూర్తిచేయటమో లేకపోతే ఒక షేపుకు తీసుకురావటమో చేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తాను విశాఖకు మారబోయే సమయానికి ఉత్థానం వాటర్ ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ పూర్తయిపోవాలని జగన్ ఆదేశించారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూడు రాజధానుల ప్రకటన ప్రకటనగానే ఉండిపోయింది. విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిగా ఉండాలని అనుకున్న జగన్ అధికారికంగా ఆ పనిచేయలేపోయారు. దీనికి కారణం ఏమిటంటే కోర్టుల్లో కేసులే. చాలాకాలంగా కోర్టుల్లో కేసులు నానుతున్న కారణంగా ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. అందుకనే అధికారికంగా మూడు రాజదానులను ఏర్పాటుచేయలేకపోయినా కనీసం తానయినా విశాఖకు వెళ్ళిపోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. మరి జగన్ వైజాగ్ కు మారితే ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates