నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ గా మారిన ఆర్ఆర్ఆర్…సందర్భానుసారంగా సొంత పార్టీపై, ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
కేంద్ర బలగాల భద్రత ఏరికోరి తెప్పించుకున్న రఘురామకృష్ణరాజు ….వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల బెదిరింపులకు భయపడబోనంటూ మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఫోన్ చేసి రాజీనామా చేయమని కోరేవాళ్లకు డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారు రఘురామకృష్ణరాజు.
తాను తన ఇమేజ్ తో పాటు జగన్ ఇమేజ్ వల్ల ఎంపీగా గెలిచానని, రాజీనామా చేేసే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆర్ఆర్ఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా జవాబిచ్చారు. సీఎం జగన్ కాళ్లు పట్టుకుని రఘురామకృష్ణరాజు ఎంపీ సీటు తెచ్చుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికలకు ముందు రఘురామకృష్ణరాజు అంటే ఎవరో జనానికి తెలీదని, ఫ్యాన్ గుర్తు, జగన్ గారి బొమ్మ పెట్టుకొని రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని నారాయణ స్వామి విమర్శించారు. ఇపుడు గెలిచిన తర్వాత తన సొంత హవాతోనే గెలిచానని రఘురామకృష్ణరాజు చెబుతున్నారని, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపీ పదవికి రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు.
జగన్ కాళ్లు పట్టుకుని రఘురామకృష్ణరాజు ఎంపీ సీటు తెచ్చుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని రఘురామరాజు చెప్పిన 24 గంటలలోపే నారాయణ స్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. గతంలో తనను రాజీనామా చేయమని కోరిన వారందరినీ ఉద్దేశించి మీడియా సాక్షిగా రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరుపడితే వారు రాజీనామా చేయాలని కోరుతున్నారని….తన సహనాన్ని పరీక్షించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏయ్ రెడ్డీస్ మీరు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే నారాయణ స్వామి రాజీనామా అంశంపై మాట్లాడారు. మరి, నారాయణ స్వామి వ్యాఖ్యలపై రఘురామరాజు రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates