Political News

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. వైసీపీ ఎంపీ కుమారుడికి బెయిల్‌

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఈరోజు అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొన్నాళ్ల కింద‌ట అరెస్ట‌యి.. జైల్లో ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే రెండు సార్లు వాద‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం తొలికేసుగా ప‌రిగ‌ణించి విచారించింది. ఈ క్ర‌మంలోనే రాఘ‌వ‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

అయితే.. ఈ బెయిల్ పిటిష‌న్‌పై గ‌తంలో స్పందించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. కానీ, తాజాగా రాఘ‌వ‌రెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాది.. అనారోగ్య కార‌ణాలు కోర్టుకు చూప‌డంతో ష‌ర‌తుల‌తో కూడిన‌ నాలుగు వారాల బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. కానీ, దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్ప‌ట్లో బెయిల్ ర‌ద్దు చేసింది. ఇక‌, మంగ‌ళ‌వారం మాత్రం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు వ్యతిరేకించలేదు. ఇదిలావుంటే.. ఈ కేసులో ఈడీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని హైకోర్టు రాఘ‌వ‌రెడ్డికి ష‌ర‌తులు విధించింది.

అయితే.. దీనికి సంబంధించి రెండు ప్లేస్‌లు డిక్లేర్ చేసింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది.అదేస‌మ‌యంలో చెన్నై వెళ్లినా.. అక్క‌డ నుంచి వేరే ప్రాంతాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఢిల్లీ హైకోర్టు ష‌రతులు విధించింది. పాస్‌పోర్టును ఇప్ప‌టికే స్వాధీనం చేసుకున్న ద‌రిమిలా.. దానిని తిరిగి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది.

కాగా, లిక్క్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్‌లో రాఘవరెడ్డి కీల‌క పాత్ర పోషించార‌ని ఈడీ అభియోగాలు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఆప్ నేత‌ల‌కు చేరిన 100 కోట్ల రూపాయ‌ల్లో ఈ య‌న ప్ర‌మేయం ఉంద‌ని కూడా తెలిపింది.

This post was last modified on July 19, 2023 8:34 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

1 hour ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

4 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

4 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

5 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

6 hours ago