యూత్ హీరోల్లో ప్రామిసింగ్ గా కనిపించే వాళ్లలో సంతోష్ శోభన్ పేరుని చేర్చుకోవచ్చు. కాకపోతే లక్కు అతనితో దోబూచులాడుతూ సక్సెస్ అందివ్వడం లేదు. ఫ్యామిలీ కథలు, మంచి డైరెక్టర్లు, పెద్ద బ్యానర్లను ఎంచుకుంటున్నా హిట్టు మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. అన్నీ మంచి శకునములే మీద గంపెడాశలు పెట్టుకుంటే అది కూడా నిరాశ పరిచింది. ఆగస్ట్ లో ప్రేమ్ కుమార్ గా రాబోతున్నాడు. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కోసం వెరైటీ ప్రమోషన్లైతే చేస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కథేంటో స్పష్టంగా ఓపెన్ చేశారు. ప్రేమ్ కుమార్(సంతోష్ శోభన్) ఎంత ప్రయత్నించి చూస్తున్నా ఒప్పుకున్న ప్రతి సంబంధం పీటల దాకా వచ్చి ఆగిపోతుంది. పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందంటే టీవీ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూ చేసేంత. దీంతో విసుగెత్తిపోయిన ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే ఒక బిజినెస్ పెడతాడు. బ్రేకప్, పెళ్ళికి ముందు అవసరమైన ఇన్వెస్టిగేషన్, కావాలంటే మూడు ముళ్ళు పడకముందే వాటిని ఆపేయడం ఇలా అన్ని సర్వీసులు ఇస్తాడు. ఒక క్లయింట్ గా వచ్చిన అమ్మాయి(రాశి సింగ్)ని లైఫ్ పార్ట్ నర్ ని చేసుకోవాలని డిసైడవుతాడు. అక్కడ అసలు స్టోరీ మొదలవుతుంది.
తన బలమైన ఎంటర్ టైన్మెంట్ నే సంతోష్ శోభన్ నమ్ముకున్నాడు. సీన్లు గట్రా కామెడీగానే అనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ మొత్తం పెళ్లి చుట్టే నడిపించారు. అభిషేక్ మహర్షి పెన్నులో వినోదం పాళ్ళు గట్టిగానే ఉన్నాయనిపిస్తోంది. స్పై దర్శకుడు గ్యారీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చారు. అంతా బాగానే ఉంది కానీ కేవలం వారం గ్యాప్ తో చిరంజీవి, రజనీకాంత్ లాంటి పెద్ద సినిమాల పోటీలో దిగుతున్న ప్రేమ్ కుమార్ భారీ రిస్కే చేస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకం బలంగా ఉంది కాబోలు. ఆగస్ట్ 18న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.
This post was last modified on July 18, 2023 7:00 pm
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…