పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాక ఆయన్నుంచి వరుసగా రీమేక్ సినిమాలే వస్తున్నాయి. ఆ సినిమాల్లో ప్రతిదానికీ ముందు బాగా నెగెటివిటీ కనిపిస్తోంది. కానీ తర్వాత నెమ్మదిగా అభిమానులు సర్దుకపోతున్నారు. రీఎంట్రీకి ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఎంచుకోవడం అప్పట్లో జనాలకు అస్సలు నచ్చలేదు. కానీ వేణు శ్రీరామ్ ఉన్నంతలో ఫ్యాన్ మూమెంట్స్‌కు ఢోకా లేకుండా ఆ సినిమా తీశాడు. సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
‘భీమ్లా నాయక్’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. వీటితో పోలిస్తే ‘బ్రో’కు మరింత నెగెటివిటీ కనిపించింది. దీని ఒరిజినల్ ‘వినోదియ సిత్తం’ మంచి సినిమానే అయినా.. అదొక ప్రవచనం లాగా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ చేసేదేముంది అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు ఆశించినంత బజ్, అభిమానుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించని నేపథ్యంలో తేజు ఒక ఇంటర్వ్యూలో ఫ్యాన్స్‌కు అభయ హస్తం ఇచ్చాడు.
‘బ్రో’ సినిమా గురించి అభిమానులు అంచనా వేసుకున్నది వేరని.. రేపు తెరపై చూడబోయేది వేరని తేజు అన్నాడు. అభిమానులు ఊహించని విధంగా, వారి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని తేజు ధీమా వ్యక్తం చేశాడు. ఒరిజినల్ చూసి సినిమా మీద ఒక అంచనాకు రావొద్దని అతను స్పష్టం చేశాడు. బేసిక్ ఐడియా మాత్రమే తీసుకుని.. దీనికి పూర్తి భిన్నమైన ట్రీట్మెంట్ ఇచ్చారని తేజు చెప్పాడు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లు ఈ సినిమాను మార్చారని అతనన్నాడు.
ఒరిజినల్లో లీడ్ క్యారెక్టర్ ఒక మిడిలేజ్డ్ వ్యక్తి అని.. ఇక్కడ యువకుడిగా మార్చడమే కాక.. తన సమస్యలు, పరిష్కారాలు అన్నీ కూడా మారిపోయాయని తేజు తెలిపాడు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని సినిమాలో మాదిరి.. చాలా వరకు ఎంటర్టైనింగ్‌గా ఉండి.. చివర్లో బలమైన ఎమోషన్స్ ఉంటాయని తేజు తెలిపాడు. డైలాగులు, స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్కు స్పష్టంగా ఉంటుందని.. కానీ ఇది సముద్రఖని మార్కు సినిమా అని.. తనకు, మావయ్య పవన్ కళ్యాణ్‌కు ఉన్న పర్సనల్ బాండింగ్ తెరపై కనిపిస్తుందని.. సినిమాలో అదొక మేజర్ హైలైట్ అని తేజు తెలిపాడు.
This post was last modified on July 18, 2023 10:52 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…