ఏపీ సీఎం జగన్ మరోసారి గెలిస్తే..“ అంటూ.. మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైసీపీ మరోసారి గెలిస్తే.. ప్రజలకు మరింత మంచి చేస్తారని.. మరిన్ని పథకాలు ఇస్తారని.. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న దానికంటే కూడా ఎక్కువ మేళ్లు చేస్తారని వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. అంతేకాదు..మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి జగనేనని కూడా చెబుతున్నారు. ఏ వేదికెక్కినా.. ఏ మైకు పట్టినా వీరి గళం నుంచి జగన్ మళ్లీ గెలుపు.. సంక్షేమం మాటే వినిపిస్తోంది.
అయితే.. తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరో అడుగు ముందుకు వేశారు. సీఎం జగన్ గెలిస్తే.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్ కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారు. ఒకరకంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు చూడాలి. అందుకే ఇంత మౌనంగా భరిస్తున్నాం“ అని కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
ఇంకా అక్కడితో కూడా ఆగని కొట్టు.. “సీఎం జగన్‌ని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారు. ఇది ఖాయం. ఈ సంగతిని వారు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది“ అని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్యల అంతరార్థం.. ప్రతిపక్షాలను లేకుండా చేయడమా.. లేక పనిగట్టుకుని కొన్ని పార్టీలను లేకుండా చేయడమా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు వైసీపీలోనూ విమర్శలు వస్తున్నాయి. “ఎవరైనా రెండోసారి విజయం దక్కించుకుంటే ప్రజలకు మరింత మేలు చేస్తారని చెప్పాలి కానీ.. మంత్రి అయి ఉండి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? పార్టీకి డ్యామేజీ కాదా“ అని వైసీపీలోనే ఓ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 8:19 am
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…