జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న వారాహి విజయయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో సాగింది ఈ సందర్భంగా ఆయన పార్టీ కీలక నాయకుడు.. విడివాడ రామచంద్రరావుకు క్షమాపణలు చెప్పారు. అది కూడా బహిరంగంగానే కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. దీనికి పవనే వివరణ ఇచ్చారు. తాను క్షమాపణలు చెప్పాలని అనుకున్నానని. అదికూడాబహిరంగంగానే చెప్పాలని నిర్ణయించుకుని చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఎవరూ ఊహించని విధంగా తణుకులో వారాహి యాత్ర బహిరంగ సభ ప్రారంభం కాగానే విడివాడ రామచంద్రరావుకు క్షమాపణలు చెప్పారు.
అసలు విషయం ఏంటంటే.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విడివాడ రామచంద్రరావు.. జనసేన తరఫున పనిచేస్తున్నా రు. అంతేకాదు.. పార్టీలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. పవన్ వస్తున్నారా..రావడం లేదా.. అనే విషయంతో సంబంధం లేకుండా.. తన పనితాను చేసుకునిపోతున్నారు. ఈ క్రమంలోనే 2019ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ టికెట్‌ను విడివాడ ఆశించారు. కానీ, పవన్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే పసుపులేటి వెంకట రామారావుకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయన మూడో స్తానానికి పడిపోయారు. చిత్రం ఏంటంటే.. తనకుటికెట్ ఇవ్వకపోయినా పసుపులేటి ప్రచారానికి విడివాడ ఎంతో పనిచేశారు.
కట్ చేస్తే..ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాతో పసుపులేటి జనసేన జెండో వదిలేశారు. కానీ, విడివాడ రామచంద్ర రావుమాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎక్కడా కూడా అసంతృప్తి లేదు. పార్టీ అంటే.. ఇప్పటికీ ప్రాణం పెడుతున్నారు. ఈ విషయం మొత్తానికి జనసేనానికి చేరింది. ఈ క్రమంలోనే తాజాగా వారాహి యాత్రకు ఆహ్వానించి గత ఎన్నికల సమయంలో జరిగిన ఘటనకు ఇప్పుడు పవన్ సారీ చెప్పారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో టికెట్ తీసుకుని పార్టీ నుంచి జంప్ అయిపోయిన పసుపులేటిపై విమర్శలు గుప్పించారు.
ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పటి కీ కూడా.. పవన్ విడివాడకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. తణుకులో నీకు టికెట్ ఇస్తాను. నువ్వు బాగా పనిచేస్తున్నావ్! అని పవన్ అని ఉంటే.. ఆ ఊపు మరింత ఎక్కువగా ఉండేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ పవన్ క్షమాపణలు కోరారు.. కానీ.. ఎక్కడా టికెట్ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. దీనిపైనే పార్టీలో అంతర్గత విమర్శలు కూడా వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని ప్రోత్సహిస్తే.. పార్టీకే మేలు జరుగుతుందని అంటున్నారు.