తరచూ వార్తల్లో ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నోట ఒక ఆసక్తికర అంశం రివీల్ అయ్యింది. నిత్యం రాజకీయం.. తన రాజకీయ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాల్ని పెద్దగా ప్రస్తావించని ఆయన.. తాజాగా మాత్రం తన మనమడి పేరేమిటో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో కొందరు రెడ్ల కారణంగా ప్రభుత్వానికి.. ఆ కులానికి చెడ్డపేరు వస్తోందన్న ఆయన.. రెడ్లు అంటే తనకు అత్యంత గౌరవమని వ్యాఖ్యానించారు. ఇక.. జగన్మోహన్ రెడ్డి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే తనకెంతో గౌరవంగా వెల్లడించారు. ఈ కారణంతోనే తన మనమడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ మీద తనకున్న అభిమానానికి అదో నిదర్శనమన్న ఆయన.. ప్రభుత్వం ఒక కులం కోసం పని చేస్తుందన్న బావనను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.
గతంలో తాము ఇదే ఫీలింగ్ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచామన్న ఆయన.. ఇప్పుడేమో ఎవరూ తీసుకురాకుండానే ఆ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసిందన్నారు. ఓట్లు వేసే దాకా అన్ని కులాలు.. ఓట్లు వేసిన తర్వాత ఒక కులం అనేది సరికాదన్నారు. జగన్ కు కులం ఫీలింగ్ లేదన్న ఆయన.. అలాంటి ఫీలింగ్ ఉన్న వారు మాత్రం పార్టీలో ఉన్నారన్నారు. ఏమైనా.. ఎంత అభిమానమైనా.. వైఎస్ పేరును రెడ్డితో సహా పెట్టుకోవటం చూస్తే.. రఘు రామకు ఆయనెంత అభిమామన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates