ప్రత్యర్థి పార్టీలు వేసే ట్రాప్‌లో చిక్కుకుంటే.. ఏం జరుగుతుందో ఇప్పుడు టీడీపీకి తెలిసి వస్తోందని అంటున్నారు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు. 2018-19 మధ్య కాలంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా అస్త్రాన్ని తెరమీదికి తెచ్చింది. ప్రజల్లో భావావేశాన్ని రగిలించింది. అప్పటి అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక హోదాను వదిలేసిందని.. తాము అధికారంలోకి రాగానే హోదాను సాధిస్తామని తేల్చి చెప్పింది.
అయితే.. అప్పటికే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్న టీడీపీ అధినేత.. దానిపై నిలబడకుండా.. వైసీపీ వేసిన ట్రాప్‌లో చిక్కుకున్నారు. దీంతో అప్పటి వరకు కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలను బయటకు తెచ్చి.. రాష్ట్రంలో అధికారం పంచుకున్న బీజేపీనాయకులను బయటకు పంపించి.. చేతులు కాల్చుకున్నా రు. దీంతో మోడీ సహా కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు కు మైనస్ మార్కులు పడ్డాయి. ఇదే తనకు మేలు చేస్తుందని బాబు అనుకున్నారు.
కానీ, పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎన్టీయే కూటమి బలోపేతం అయ్యేలా మోడీ వ్యూహాత్మకం గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్డీయే సృష్టికర్త అయిన.. టీడీపీకి పెద్దపీట పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ, మోడీ సహా బీజేపీ పెద్దలు టీడీపీని పట్టించుకోలేదు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న 12 పార్టీలతో ఈనెల 18న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసినా.. టీడీపీని ఆహ్వానించలేదు. ఇదే విషయాన్ని టీడీపీ కూడా వెల్లడించింది.
తమకు ఆహ్వానం అందలేదని చెప్పింది. అయితే.. అంతర్గత చర్చల్లో మాత్రం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు వైసీపీ వేసిన ట్రాప్‌లో చిక్కుకుని ఉండకపోతే.. ఇప్పుడు తమకు ప్రథమ ఆహ్వానం అందేదని అంటున్నారు. వైసీపీ వంటి చిన్నపార్టీలో ఏమాత్రం అనుభవం లేని పార్టీ వేసిన ట్రాప్‌లో చిక్కుకున్న ఫలితంగా ఇప్పుడు ఎన్టీయేలో అసలు చోటు లేకుండా పోయిందని ఒకరిద్దరు సీనియర్లు మీడియా ముందు వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు కనుక వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకుంటే.. మళ్లీ పూర్వవైభవం ఖాయమని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 8, 2023 9:45 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…