ఇటీవల ఏపీ సీఎం జగన్.. వైసీపీలో ప్రజలకు చేరువ కాని నేతలు అంటూ.. సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన గడపగడపకు కార్యక్రమం ద్వారా నాయకులు ప్రజలకు చేరువ కావాలనేది వైసీపీ లక్ష్యం. దీంతో ప్రజలకు, నేతలకు మధ్య ఉన్నగ్యాప్ తగ్గుతుందని ఆయన అంచనా వేశారు, ఈ క్రమంలో నే గడపగడప కు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 31 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. ఇప్పటికీ ఈ కార్య క్రమం ప్రారంభించి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిమూడు మాసాలకు ఒకసారి ఈ కార్యక్రమంపై సీఎం జగన్ ఆరాతీస్తున్నారు. ఐప్యాక్ టీం ఇస్తున్న నివేదికలను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. తరచుగా ఎమ్మెల్యేలతో భేటీ అయినా.. గడపగడపకు కార్యక్రమంపై ఆయన సమీక్షిస్తున్నారు.
ఇలా.. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే.. ఈ సమీక్ష లో ఎప్పటికప్పుడు 20-25-18-15 అంటూ.. అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్యను సీఎం జగన్ చెబుతున్నారు. వీరు ప్రజల్లోకి వెళ్లడం లేదని, ప్రజల్లో ఉండడం లేదని వివరిస్తున్నారు. వీరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమేనని కుండబద్దలు కొడుతున్నారు. గతంలో అయితే.. ఎవరెవరు వెనుకబడి ఉన్నారనేది సీఎం జగన్ పేర్లుతో చెప్పేవారు.
అయితే.. తాజాగా మాత్రం 15 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని.. చెబుతూనే వారి పేర్లను మాత్రం బహిరంగంగా చెప్పబోనని వ్యాఖ్యానించారు. అయితే.. ఇలా ఎందుకు గుట్టుగా ఉంచారనేది కూడా ఆసక్తిగా మారింది. దీనిని పరిశీలిస్తే.. కీలకమైన నాయకులే ఉన్నారనేది తాజాగా తాడేపల్లి వర్గాలు చెబుతున్న మాట. వీరిలో మాజీ మంత్రులు ముగ్గురు ఉన్నారని.. వీరిలోనూ ఒక మహిళా మాజీ మంత్రి ఉన్నారని..అంటున్నారు.
అ దేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఒక ఎస్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని.. ప్రచారం జరుగుతోంది. అందుకే వారి పేర్లు బయటకు చెప్పలేదని.. చెబితే.. పార్టీలో పెను ఉప్పెన ఖాయమని సీఎం జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇదీ.. సంగతి!
Gulte Telugu Telugu Political and Movie News Updates