పొలిటికల్ క్యామెడీ కింగ్ కేఏ పాల్ తాజాగా అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత.. శాంతిదూతనైన తననే సీఎం చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదని అన్నారు. శుక్రవారం అనంతలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్ళానని.. కానీ ఆయన అక్కడ లేరని చెప్పారు. కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యానన్నారు.
వ్యక్తిగతంగా తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా 100 మంది బౌన్సర్స్లతో.. చంద్రబాబులా హై సెక్కురిటీతో తిరగడంలేదని.. సింగిల్‌గా వెళుతున్నానని పాల్ అన్నారు. ‘‘చంద్రబాబు.. దమ్ముంటే నాతో డెబిట్‌కు రా.. ఎలాగూ లోకేష్‌కు మాట్లాడడం రాదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేష్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడు. మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు.“ అని వ్యాఖ్యానించారు.
ఇక, జనసేనపైనా పాల్ విరుచుకుపడ్డారు. కేవలం 15 సీట్లకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడని, దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యాలని సవాల్ రువ్వారు. పవన్ కళ్యాణ్.. ప్రజాశాంతి పార్టీలోకి వచ్చి.. జనసేనను విలీనం చెయ్యాలని పిలుపునిచ్చారు. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని పాల్ విమర్శించారు.
తనను ఓ కామెడీ కింగ్‌లాగా కొన్ని మీడియాలు చూపిస్తున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. ఆదాని, అంబానీలతో నార్త్ మీడియాను మోడీ కొనేశారని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో విలీనం అంటూ వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యా.. కేతిరెడ్డి వద్దు, బాబు వద్దు మీరు సీఎం కావాలని అన్నారన్నారు.
100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేఏపాల్ విమర్శలు గుప్పించారు.
This post was last modified on June 24, 2023 11:10 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…