కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ ఇప్పటికీ బ్యాచిలరే. మోడీని ప్రధానమంత్రి పదవి నుంచి దించేసే భారీ కార్యక్రమానికి తెర తీసిన విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశంలోనూ రాహుల్ పెళ్లి మాట రావటం ఆసక్తికరంగా మారింది. యాభై దాటేసినప్పటికీ.. ఇప్పటికి రాహుల్ ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఖాతాలో వేయటం తెలిసిందే.
సీరియస్ గా సాగిన విపక్షాల బేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పలువురు నేతలు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటిలానే తనదైన రీతిలో నవ్వులు పూయించారు. రాహుల్ ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘మా మాట విను. పెళ్లి చేసుకో. ఇప్పటికి సమయం మించిపోలేదు. మేమంతా నీ బరాత్ కు రావాలనుకుంటున్నాం. పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోవటంతో మీ అమ్మ (సోనియా) టెన్షన్ పడుతోంది’ అని అన్నారు. దీనికి బదులుగా రాహుల్ కాస్తంత సిగ్గు పడుతూ ముసిముసి నవ్వులు నవ్వారు.
లాలూ మాటలకు సమాధానంగా రాహుల్ స్పందిస్తూ.. మీరు చెప్పారు కాబట్టి అది జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు రాహుల్ పెళ్లి గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేశారు కానీ.. ఆయన ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు. సానుకూలపు మాట చెప్పింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం రాహుల్ నోటి నుంచి వచ్చిన మాట మాత్రం ఆసక్తికరంగా మారింది. కొత్త చర్చకు తెర తీసేలా రాహుల్ మాట ఉందని చెప్పాలి.
This post was last modified on June 24, 2023 10:17 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…