ముద్రగడ పద్మనాభం… ఒకప్పుడు అంటే.. 2018కి ముందు వరకు ఆయన కాపులకు ఒక ఐకాన్ లా వ్యవహ రించారు. వారికి రాజ్యాధికారం.. రిజర్వేషన్ కోసం.. ఆయన ఎంతో తపించారు. చంద్రబాబు సర్కారుపైనా తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు ప్రకటించారు. అలాంటి నాయకుడు వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత.. అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. పైగా.. ఇప్పుడు కాపు నాయకుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయన ఫేడ్ అవుట్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.
నిజానికి పవన్ తన దూకుడుతో ఏదైనా వ్యాఖ్యలు కొంత పొరపాటుగా చేసి ఉండొచ్చు. కాపు పెద్దగా పవన్‌ను కలిసి.. ఆయనకు సూచనలు ఇచ్చే అవకాశం ముద్రగడకు ఎలా ఉంటుంది. పైగా.. ఎవరు వచ్చినా.. ఆహ్వానిస్తానని, పార్టీలతో సంబంధం లేదని.. పవన్ పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో సరైన అవకాశాన్నివినియోగించుకుని ముద్రగడ మెరుగైన ఆలోచనతో వ్యవహరించి ఉంటే.. బాగుండేదనే సూచనలు వస్తున్నాయి. కానీ, ఆయన తన లేఖ ద్వారా పరోక్షంగా వైసీపీకి తాను మద్దతు ఇస్తున్నట్టుగా వ్యవహరించారని అంటున్నారు పరిశీలకులు.
దీంతో అన్ని వైపుల నుంచి కూడా ముద్రగడకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాపు సంక్షేమ సమితి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి అమ్ముడుపోయారంటూ.. కాపు సంక్షేమ సేన నేత కృష్ణాంజనేయులు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ముద్రగడ తన స్థాయిని తనే దిగజార్చుకున్నార ని తెలిపారు. జనసేనాధిపతిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను సినీ హీరోగా ప్రస్తావించడం వెనుక కుట్ర అర్ధం అవుతుందని అన్నారు.
కాడి పారేసి ఇంట్లో కూర్చున్న ముద్రగడ ఇప్పుడు లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో నష్టపోయున వారిని పరామర్శించారా అంటూ నిలదీశారు. వంగవీటి మోహనరంగా పేరు జిల్లాకు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని అడిగారు. పవన్ కళ్యాణ్‌ను, అతని కుటుంబ సభ్యులను బూతులు తిడితే నువ్వెక్కడున్నావని అన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు మహిళలను కొడితే ఎందుకు ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ముద్రగడ.. ఎక్కడోడైల్యూట్ అయినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates