ఈమధ్యనే సరికొత్త సెక్రటేరియట్ నిర్మించిన కేసీయార్ తొందరలోనే అసెంబ్లీ, శాసనమండలికి కూడా కొత్త భవనాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ, మండలి భవనాలు ఒకే కాంపౌండ్ లో నిర్మిస్తే వెహికల్ పార్కింగ్, సెక్యూరిటి లాంటి అనేక అంశాలు కలిసొస్తాయని అనుకుంటున్నారట. రాజభవన్ తో పాటు పక్కనే ఉన్న సర్సింగ్ కాలేజీ, దిల్ కుశా గెస్ట్ హౌస్ ప్రాంతంలో కొత్త భవనాలను నిర్మించేందుకు కేసీయార్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ఇపుడు రాజ్ భవన్, నర్సింగ్ కాలేజీ, గెస్ట్ హస్ పరిధిలో సుమారు 30 ఎకరాలున్నాయి. వీటిల్లో రాజ్ భవన్ ను పక్కనపెట్టినా కావాల్సినంత ఖాళీ స్ధలం ఉంది. కాలేజీ చాలా పాతపడిపోయింది. ఇక గెస్ట్ హౌస్ ను ఎవరు వాడటంలేదు. నిజానికి ఈ గెస్ట్ హౌస్ రాష్ట్ర విభజనలో ఏపీకి వచ్చింది. అయినా సరే దీన్నెవరు వాడటంలేదు. కాలేజీ, గెస్ట్ హౌస్ కాంపౌండ్లలోనే చాలా ఖాళీస్ధలముంది. కాబట్టి రాజభవన్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్ధలంతో పాటు కాలేజీ, గెస్ట్ హౌస్ ను కూడా కూలగొట్టేస్తే సరిపోతుందని కేసీయార్ అనుకుంటున్నారట.
ఏ కారణం వల్లనైనా రాజ్ భవన్ ను ముట్టుకునేందుకు సాధ్యంకాదని అనుకున్నా కాలేజీ, గెస్ట్ హౌస్ ప్రాంగణాలను తీసుకుని కొత్త భవనాలు కట్టాలని కూడా అనుకుంటున్నారట. కేసీయార్ అనుకున్నట్లుగానే అసెంబ్లీ, శాసనమండలికి కొత్త భవనాలు నిర్మించవచ్చనే అనుకుందాం. మరి ఇపుడున్న అసెంబ్లీ, మండలి భవనాలను ఏమిచేస్తారు ?
భవనాలే కాకుండా వాటిచుట్టూతా చాలా ఖాళీస్ధలముంది. నిజంగానే అసెంబ్లీ, మండలికి కొత్త భవనాలనే నిర్మించాలని అనుకుంటే ఇపుడున్న భవనాలకు ఆనుకున్న ఖాళీ స్ధలంలోనే కట్టవచ్చు. అసెంబ్లీ, మండలి భవనాలు చారిత్రక కట్టడాలని అందరికీ తెలిసిందే. కాబట్టి వీటిని కూలగొట్టడం ప్రభుత్వానికి సాధ్యంకాదు. అయితే వీటిచుట్టూ ఉండే ఖాళీ భూములనే ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ నర్సింగ్ కాలేజీ, గెస్ట్ హౌస్ భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టేబదులు ఉన్న ఖాళీ భూముల్లోనే భవనాలను నిర్మంచవచ్చు కదా. ఏమో కేసీయార్ ఏమాలోచిస్తారో ఎవరికీ తెలీదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates