రాహుల్ గాంధీ ఇంకా తన తప్పును అంగీకరించటంలేదు. కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటిలో చదువుతున్న భారత సంతతి విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాహుల్ పై అనర్హత వేటు లాంటి అనేక అంశాలు చర్చకొచ్చాయి. విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానమిస్తు తనపై అనర్హత వేటుపడుతుందని తాను ఏమాత్రం ఊహించలేదన్నారు. పరువునష్టం కేసులో దేశంమొత్తంమీద తనకే ఎక్కువ శిక్ష పడినట్లు తాను భావిస్తున్నట్లు చెప్పారు.
నిజమే రాహుల్ వ్యాఖ్యల్లో కొంత వాస్తవం ఉంది. పరువునష్టం కేసులో ఎంపీ పదవికి అనర్హుడిగా చేయటం అంటే చాలా పెద్దశిక్షను విధించటమనే అనుకోవాలి. గతంలో ఎవరిపైనా అనర్హత లాంటి పెద్దశిక్షను పార్లమెంటు విదించలేదు. అయితే ప్రజాప్రాతినిధ్యం చట్టాలను కూడా రాహుల్ మరచిపోవటమే విచిత్రంగా ఉంది. ఏ నేరంలో అయినా రెండేళ్ళు అంతకుమించిన శిక్షపడితే ఆటోమేటిక్కుగా పదవిపై అనర్హత వేటుపడుతుందని రాహుల్ కు తెలీదా ? తనపై అనర్హత వేటు వేసే అవకాశాన్ని కేంద్రప్రభుత్వానికి రాహుల్ తనంత తానే అవకాశమిచ్చారు.
దేశాన్ని వదిలిపారిపోతున్న ఆర్ధిక నేరగాళ్ళందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకుంటోందని కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ సెటైర్లు వేశారు. నిజానికి రాహుల్ సెటైర్లు నరేంద్రమోడీని ఉద్దేశించింది మాత్రమే అయితే రాహుల్ సెటైర్ తో గుజరాత్ లోని మోడీలందరికీ మండిది. ఎందుకంటే మోడీ అనేది ఇంటిపేరు. మోడీ అనే ఇంటిపేరుతో గుజరాత్ లో కొన్ని లక్షలమందుంటారు. రాహుల్ వ్యాఖ్యల వల్ల ఏమైందంటే మోడీ అనే పేరున్న వాళ్ళంతా ఆర్ధికనేరగాళ్ళు, దేశాన్ని వదిలేసి పారిపోయేవాళ్ళనట్లుగా అర్ధమొచ్చింది.
దీంతోనే రాహుల్ పై పూర్ణేషు మోడీ అనే బీజేపీ ఎంఎల్ఏ పరువునష్టం దావా వేశారు. ఆ కేసులోనే సూరత్ కోర్టు రాహుల్ కు రెండెళ్ళ శిక్ష విధించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తన సెటైర్ పై గోల మొదలవ్వగానే రాహుల్ క్షమాపణ చెప్పుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. అయితే అందుకు రాహుల్ అంగీకరించకపోవటంతోనే చివరకు అనర్హత వేటు పడింది. అంటే ఇప్పటికీ తాను మాట్లాడింది తప్పని రాహుల్ అంగీకరించటం లేదని అర్ధమవుతోంది.
This post was last modified on June 2, 2023 11:06 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…