కలిసి ఆ పుణ్యపురుషుని స్మరించుకుందాం మిత్రమా..

నిద్రాణమై ఉనికి కోల్పోతున్న తెలుగుజాతిని వెన్నుతట్టి లేపి జవసత్వాలనిచ్చిన మహనీయుడు శ్రీ నందమూరి తారకరామారావు. రాజకీయాలు ప్రజాహితం కోసమే అని నినదించి సమాజాన్ని దేవాలయంగా భావించి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రజాసేవకుడు అన్న శ్రీ నందమూరి.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరో ప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రుడాయన. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడి తుదివరకూ తెలుగువారి కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తంగా సగర్వంగా రెపరెపలాడించిన కారణజన్ముడాయన.

అటువంటి మహనీయుని గురించి ముందు తరాల వారికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిది. ఈ నెల 28న తెలుగు వెలుగు , అన్న శ్రీ నందమూరి తారకరాముని శతజయంతి వేడుకల సందర్భంగా మరొక్కసారి మనమంతా కలిసి ఆ పుణ్యపురుషుని స్మరించుకుందాం. సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ ఈ వేడుకకి తరలిరావాలని ఆహ్వానిస్తూ..

  • మీ తెలుగుదేశం ఆస్ట్రేలియా