విఫ‌ల‌మవుతున్న జ‌గ‌న్ మాన‌స పుత్రిక‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌..ఎంతో ఇష్టంగా తీసుకువ‌చ్చిన‌కొన్ని కొన్ని ప‌థ‌కాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌నే వాద‌న ఉం ది. వీటిలో స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఇబ్బందుల్లోప‌డింద‌ని తెలుస్తోంది. అధికారుల నుంచి ఒత్తిడి, ప‌ని వేళ‌లు, వంటివి ఒక‌వైపు ఇబ్బందిపెడుతుంటే.. మ‌రోవైపు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేసే వారికి జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేస్తున్న‌వారు వేరే ఉద్యోగాలు చూసుకుంటున్నారు.

సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేయడం, ఎంపిక చేసినవారికి పోస్టిం గ్‌లు ఇవ్వకపోవడం, ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు జాబ్‌చార్ట్‌ రూపొందించకపోవడం, జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. ఎన్నేళ్లు పనిచేసినా పదోన్నతి లేదన్న నిరాశతో చివరకు ఉద్యోగాలను వదులుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10శాతం మంది సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు వదిలి వెళ్లారు. మొత్తం 1.34 లక్షల మందిని నియమిస్తే రాష్ట్రవ్యాప్తంగా 1.24లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన లే అవుట్ల ప‌థ‌కం కూడా..ఆదిలోనే ఫైళ్ల నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయిం ది. రాష్ట్రంలో పేద‌ల‌కు ఇళ్ల‌నుకేటాయిస్తామ‌ని చెబుతూ.. అదే ప‌నిచేస్తున్న జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వం.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని ఆకట్టుకున‌నేందుకు కొన్నాళ్ల కింద‌ట ప్ర‌య‌త్నించింది.

ఈ క్ర‌మంలో లే అవ‌ట్లు వేస్తున్నాం కొనుగోలు చేయండి..అంటూ పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు కూడా చేసింది. అయితే.. ఒక్క‌రూ దీనిపై దృష్టి పెట్ట‌లేదు. దీంతో ఆ ప‌థ‌కం అక్క‌డే ఆగిపోయింది. ఇక‌, తాజాగా ప్రారం భించిన జ‌గ‌న‌న్న‌కు చెబుదాం.. కార్య‌క్ర‌మానికి  ఫోన్ల‌తోపాటు అంతే వేగంగా.. విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నా యి. దీంతో ఈ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అప్పుడే విముఖ‌త ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ఇలా.. కీల‌క‌మైన ప‌థ‌కాలు కొన్ని తెర‌చాటుకు చేరిపోయే ప్ర‌మాదం పొంచిఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.