కర్ణాటకలో బీజేపీని దారుణంగా దెబ్బ తీసిన తెలుగోళ్లు

అధికార పార్టీగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనతా పార్టీకి దారుణమైన పరాజయాన్ని రుచి చూపించారు కన్నడిగలు. అయితే.. ఇందులో తెలుగోళ్ల పాత్ర తక్కువేం కాదన్న విషయం ఇప్పుడుబయటకు వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మహా నగరంలో తెలుగు వారితో పాటు ఉత్తరాది వారు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. ఇక.. కర్ణాటకలోని చాలా జిల్లాల్లో తెలుగువారి ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు భారీగానే ఉన్నాయి.

ఇలాంటి చోట్ల.. వచ్చిన ఫలితం చూస్తే.. కాంగ్రెస్ తాజా విజయంలో తెలుగువారుకీలక భూమిక పోషించిన వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బెంగళూరుతో పాటు.. తెలుగు వారు ఎక్కువగా నివసించే జిల్లాలు కర్ణాటకలో దాదాపు పది వరకు ఉన్నాయనే చెప్పాలి. ఈ జిల్లాల్లో బీజేపీకి వచ్చిన సీట్లు చాలా తక్కువ. మొత్తం పది జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవటం.. మిగిలిన ఆరు జిల్లాల్లో ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న జిల్లాలు మూడు ఉంటే.. మిగిలిన మూడు జిల్లాల్లో రెండేసి స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు.

ఈ పది జిల్లాల్లో మొత్తం 63 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ గెలిచింది మాత్రం కేవలం 9 స్థానాల్లోనే. ఒక విధంగా చెప్పాలంటే.. బీజేపీ దారుణ పరాజయంలో ఈ పది జిల్లాలు కీలక భూమిక పోషించాయని చెప్పాలి. ఇంతకూ ఆ 10 జిల్లాలు.. వాటిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు.. బీజేపీ గెలిచిన స్థానాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగు వారి కొట్టిన దెబ్బ ఎంతన్నది తెలుస్తుంది.

జిల్లా పేరుఅసెంబ్లీ స్థానాలుబీజేపీ గెలిచిన స్థానాలు
బళ్ళారి50
చిక్కబళ్ళాపూర్50
చిత్రదుర్గా61
కాలబురుగి92
కొప్పల్51
కోలార్60
రాయచూర్72
తుంకూరు112
విజయనగర51

మొత్తం 63 స్థానాలకు గెలిచింది ‘9’. బెంగళూరు మహానగరంలో ఉత్తర భారతానికి చెందిన వారు ఎక్కువమంది ఉండటంతో బీజేపీ ఎక్కువ స్థానాల్ని అక్కడ గెలవగిలింది. అదే సమయంలో కన్నడిగులు..తెలుగు వారి ప్రాబల్యం ఉన్న చోట బీజేపీ దారుణ పరాజయం పాలైంది. కాంగ్రెస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది.