తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పవన్ కల్యాణ్ ఫోలో అవుతున్నట్లనిపిస్తోంది. మరోసారి జయలలితకు ఓటేస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని 1995లో రజనీకాంత్ వదిలిన ఒక డైలాగ్ దెబ్బకు 1996 ఎన్నికల్లో పురచ్చితలైవి ఓడిపోయారు. ఇప్పుడు అటు తిరిగి పవర్ స్టార్ కూడా అదే పంధాలో మాట్లాడుతున్నారు. మరో సారి జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అధోగతేనని పవన్ అన్నారు. వరుసగా రెండు రోజులు ఆయన మీడియా ముందుకు వచ్చి.. దాదాపు ఒకే విషయాన్ని చెప్పారు. వైసీపీని ఓడించడమే ధ్యేయమంటూ మరోసారి జగన్ వస్తే అంతేనన్నారు… ఏపీ రజనీకాంత్..
పవన్ కల్యాణ్ మాటల్లో చాలా కన్‌ఫ్యూజన్ ఉందని మరో సారి నిరూపితమైంది. తెలుగుదేశానికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని అంటారు. అంతలోనే ముక్కోణ పోటీలో నష్టపోదలచుకోలేదని చెబుతారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి పదవిపై చర్చ ఎన్నికల తర్వాతే ఉంటుందంటారు. అంటే ఒక స్పీచ్‌లోనే మూడు పరస్పర విరుద్ధమైన డైలాగులన్నమాట.
వరుసగా రెండు రోజుల పవన్ కల్యాణ్ స్పీచ్‌లో ఒక్క విషయం మాత్రం అర్థమవుతోంది. ఏపీ సీఎం పదవిపై ఆయన ఆశలు వదులుకోలేదని తేలిపోయింది. సీఎం పదవి వద్దని అంటే జనసైనికులు ఒప్పుకోరన్న అనుమానం కూడా ఉంది.
మరో పక్క సీఎం పదవిపై చర్చ జరగలాంటే టీడీపీకి సీట్లు తగ్గాలని తెలియనిది కాదు.. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో జనసేనకు 30 స్థానాలకు మించి టీడీపీ కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన గెలిస్తేనే సీఎం పదవికి గాలం వేసే అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా టీడీపీకి 80 కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పుడే పవన్ కోరిక తీరుతుంది ఖచితంగా చెప్పాలంటే ఒక ప్రభంజనంలా కూటమికి ఓట్లు పడితేనే జనసేనకు 30 స్థానాలు వచ్చే ఛాన్సుంటుంది. అప్పుడు టీడీపీకి కూడా 100 స్థానాలు దాటడం ఖాయం. అదే జరిగినప్పుడు సీఎం పదవిని పవన్ కల్యాణ్‌కు వదిలేసేందుకు టీడీపీ ఎందుకు ఒప్పుకోవాలో ఎవరికీ అర్థం కాదు. ఏదో జనసేనాని ఆశ తప్పితే పెద్దగా జరిగేదేమీ లేదు..
Gulte Telugu Telugu Political and Movie News Updates