ఇది.. ‘బీజేపీ కేర‌ళ స్టోరీ’?

పెట్రోల్‌పై పావ‌లా త‌గ్గించేందుకు మ‌న‌సు ఒప్ప‌ని ప్ర‌భుత్వాలు.. పేద‌ల‌కు ప‌ట్టెడు కూడు పెట్టండి.. క‌రోనా తో అత‌లా కుత‌లం అవుతున్నార‌ని అంటే.. లెక్కులు వేసుకున్న స‌ర్కార్లు.. ఇప్పుడు.. ఉదారంగా ముందు కు వ‌చ్చాయి. ఏదోప్ర‌జాసేవ చేసేందుకో.. దేశాభివృద్ది కోస‌మో కాదు.. ఒక సినిమానుప్ర‌జ‌ల‌తో చూపించేందు కు! ఆ సినిమాను ప్ర‌జ‌ల మైండ్‌లోకి ఎక్కించేందుకు ఏకంగా కోట్ల‌కు కోట్ల సొమ్మును ఉదారంగా వ‌దిలేసుకు న్నాయి. అవికూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌త మార్పిళ్లు, ఉగ్రవాదం అంశాల‌ను ప్ర‌ధానంగా తీసుకుని రూపొందించిన ది కేర‌ళ స్టోరీ సినిమా విష‌యంలో ఆది నుంచి బీజేపీ సానుకూలంగా ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో సినిమా ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఇక‌, ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, క‌ర్ణాట‌కలు వినోద పన్ను మినహాయింపును ప్రకటించాయి.

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ర‌కంగా.. ఈ ప‌న్ను ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఒక్కొక్క రాష్ట్రం సుమారు 20 నుంచి 40 కోట్ల వ‌ర‌కు ప‌న్నును వ‌దులు కోవ‌డం గ‌మ‌నార్హం. అయినా.. ఫ‌ర్వాలేదు.. కానీ ఈ సినిమాను అంద‌రికీ చూపిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప‌న్ను త‌గ్గ‌డం వ‌ల్ల‌.. ఏం జ‌రుగుతుందంటే.. సినిమా టికెట్ల ధ‌ర‌లు తగ్గుతాయి. ఒక్కొక్కొ టికెట్‌పై ఎంత లేద‌న్నా.. 5 నుంచి 10 రూపాయ‌లు త‌గ్గుతుంద‌ని.. అంచ‌నా. దీంతో ఎక్కువ మంది ఈ సినిమా చూసే(చూపించే) అవ‌కాశం ఉంటుంది.

ఇక‌, ఇప్ప‌టికే బీజేపీ కీల‌క నేత‌లు అంద‌రూ కేర‌ళ స్టోరీని వీక్షించారు. ఇదిలావుంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణ‌యంపై.. నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఆ చేత్తోనే.. పెట్రోల్ సెస్సులు త‌గ్గించండి. ఆ చేత్తోనే.. ప‌న్నులు త‌గ్గించండి.. అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు .. ఇది బీజేపీ కేర‌ళ స్టోరీ.. బ్రో! అంటూ.. పెద‌వి విరుస్తున్నారు.

కేసీఆర్ ఏం చేస్తారు?

ఇదిలావుంటే.. బీజేపీని వ్య‌తిరేకించే రాష్ట్రాల్లో కేర‌ళ స్టోరీని ప్ర‌భుత్వాలునిషేధించాయి. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పూర్తిగా, తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లలో ఈ చిత్ర ప్రదర్శనలను ఇప్పటికే నిలిపివేశా రు. ఇక‌, మోడీ అంటే.. ఒంటికాలిపై లేచే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. మ‌రి ఆయ‌న కూడా ఈ సినిమాను నిషేధిస్తారా? లేక‌.. సినిమాను సినిమాగానే చూస్తారా? అనేది వేచి చూడాలి.