ఓపెన్ హార్ట్ ఎఫెక్ట్: కష్టాల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మేనేజింగ్ డైరెక్ట‌ర్ వేమూరి రాధాకృష్ణ నిర్వ‌హించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర మం.. బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ పొలిటీషియ‌న్‌.. విష్ణుకుమార్‌రాజు స‌స్పెన్ష‌న్‌కు దారి తీస్తోందా? బీజేపీ ఆయ‌న‌ప‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఈ ఓపెన్ హార్ట్ కార్య‌క్ర‌మం ఆదివారం(7వ తేదీ) రాత్రి 8.30కు ప్ర‌సారం కావాల్సి ఉంది. అయితే.. ఇప్ప‌టికే రెండు రోజులుగా ప్రోమో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్రోమోలో.. విష్ణు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న బీజేపీ రాష్ట్ర‌నాయ‌క‌త్వం.. ఆయ‌న‌కు నోటీ సులు పంపించింది. పార్టీ నుంచి ఎందుకు స‌స్పెండ్ చేయ‌కూడ‌దో చెప్పాల‌ని కూడా.. ఆయ‌న‌ను ప్ర‌శ్నిం చింది. ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సీఎం జ‌గ‌న్ అక్ర‌మ సంపాదనపై రాజు వ్యాఖ్య‌లు చేశార‌ని.. బీజేపీ నేత‌లు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో విష్ణు కుమార్‌రాజుకు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఓపెన్ హార్ట్ కార్య‌క్ర‌మంలో విష్ణుకుమార్‌ రాజు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు జారీ చేశారని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీవర్గాల కథనం ప్రకారం.. విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. వ్యాఖ్యలపై ఆదివారం సాయంత్రంలోగా(కార్య‌క్ర‌మం ప్ర‌సారం కావ‌డానికి ముందే) వివరణ ఇవ్వాలని, లేకుంటే సస్పెన్షన్‌కు గురికావలసి వస్తుందని హెచ్చరించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలపై(వివేకా కేసులో సీబీఐ వ్య‌వ‌హారం) అసత్య ఆరోపణలు, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశానికి పిలవకపోయినా పిలిచినట్లు ప్రస్తావిస్తూ అబద్ధపు మాటలు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. మ‌రి దీనిపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.