Political News

టీడీపీ-వైసీపీ: మేనిఫెస్టోల‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న….

నవరత్నాలు అనే కీలకమైన అంశాన్ని తీసుకుని మేనిఫెస్టో రూపొందించింది ఇందులో పేర్కొన్న అంశాలను అమలు చేస్తున్నామని సంక్షేమ ప్రభుత్వం అని తరచుగా చెబుతున్నటు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నవరత్నాల్లో ఉన్నటువంటి చాలా అంశాల్లో వెనుకబాటు త‌నాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా జగన‌న్న ఇళ్ల పథకంలో ఇప్పటికీ కూడా పునాదులు స్తాయి దాటినటు వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిని పరుగులు పెట్టించి పూర్తి చేయాలి.. అనుకున్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. అదే విధంగా అమ్మ ఒడి వంటి పథకాలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి.

వైయస్సార్ చేయూత ఇతరత్రా ఆర్థికపరమైనటు వంటి అంశాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మార‌డంతో వచ్చే మేనిఫెస్టోలో ఇంత భారీ స్థాయిలో ఆర్థిక పథకాలను ప్రకటించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు నాటికి మేనిఫెస్టో ఇలాగే ఉన్నప్పటికీ కూడా నవరత్నాలు స్థానంలో మరో కీలకమైనటు పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిలో గ్యాస్ సిలిండర్‌ల‌కి సంబంధించి, అలాగే ఉపాధి ఉద్యోగ విషయాల్లో కొంత కీలక చోటు చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఇచ్చినటు మేనిఫెస్టోలపై వైసిపి అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. అక్కడ మేనిఫెస్టోలు కనుక ప్రజాభిమానం పొంది బిజెపి కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టయితే అక్కడ మేనిఫెస్టోలను తీసుకుని వాటి నుంచి కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకుని ఇక్కడ మార్పులు చేర్పులు చేస్తారని తెలుస్తోంది. అయితే 2019లో ఇచ్చిన హామీలు అయితే ఈసారి ఉండబోవని కచ్చితంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, టిడిపిలో కూడా మేనిఫెస్టో పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు సాగుతున్నాయి. ‘పీ 4’ వంటి ప్రణాళికలను చంద్రబాబు ఈసారి మేనిఫెస్టోలో ప్రకటించడం ఖాయంగా క‌నిపిస్తోంది. పాత అప్పులు తగ్గించడం ఆర్థికంగా బలోపేతం చేయడం పేద వర్గాలకు గృహ నిర్మాణం అంటే అంశాలపై టీడీపీ పెద్ద ఎత్తున దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే ప్రజల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ అమ్మఒడి. దీనిని కొనసాగిస్తారా లేదా అనే దానిపై చంద్రబాబు ఇప్పడే ఏమీ హామీ ఇవ్వలేకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి అమ్మబడి వంటి పథకాన్ని కొనసాగించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అన్న క్యాంటీన్ రైతులకు రుణమాఫీ వంటివి కొన్ని ఆ అందుబాటులో ఉన్న‌ అంశాలనైన పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగ కల్పన వలంటీర్ల కొనసాగింపు వంటివి కొనసాగుతాయి. అయితే వ‌లంటీర్లు కొనసాగించినప్పటికీ టిడిపి వారిని రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే వైసిపి మేనిఫెస్టోలో ఈసారి భారీ ఎత్తున ఆర్థిక పథకాలను తగ్గించి ఈసారి సామాజిక అంశాలను పథకాలుగా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులని తీర్చే మార్గం లేకపోవడం అప్పులు పుట్టే పరిస్థితి లేక‌పోవ‌డం వంటివి మేనిఫెస్టోను ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

మ్యానుఫెస్టోలో తీసుకున్నట్లయితే గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మధ్య నిషేధం ఈసారి ఏం చేస్తారనేది చ‌ర్చ‌గా మారింది. మొత్తంగా చూస్తే మేనిఫెస్టో పై ఇటు వైసిపి లోను అటు టిడిపిలోనూ పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎవరికి వారు ధీమాగా మేనిఫెస్టో బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. అయితే ఎలా ఉంటుంది ఏమేం అంశాలను తీసుకోవాలి? ఏ విధంగా ముందుకు సాగాలి? డిజిటలీ కరణ చేయడం ద్వారా కొంత వైసీపీకి దెబ్బ కొట్టాలి అనేటటువంటి టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రజలకు పంచుతుంది కానీ దీనికన్నా ఇంకా ఎక్కువగా ఆర్థిక భారం లేనటువంటి పథకాలను తీసుకురావడం దిగా అడుగులు వేయాలి అనేటటువంటిది ఇటీవల జరిగినటువంటి చర్చల్లో తెలిసిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిబట్టి మేనిఫెస్టో అంశంపై టిడిపి అటు వైసిపి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయ‌ని స‌మాచారం. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

This post was last modified on May 3, 2023 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

2 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

3 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

4 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

5 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

5 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

6 hours ago