వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోరి తెచ్చుకున్న క‌ష్టం…!

“మీరు మాకు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ్డారో ఆలోచించుకోవాలి. మీరు కాదంటే.. మ‌మ్మ‌ల్ని ఆహ్వానించేవా రు లేర‌ని అనుకోవ‌ద్దు. మాకు ఉండాల్సిన మార్గాలు.. మాకు ఉన్నాయి. క‌నీసం మీరు మ‌మ్మ‌ల్ని క‌న్నెత్తి ప‌ల‌క‌రించ‌డ‌మే మానేశారు. మేం మీకు ఎందుకు అండ‌గా ఉండాలి” -ఇదీ.. అత్యంత కీల‌క‌మైన మంగ‌ళ గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్నారెడ్డిని ఉద్దేశించి.. ఆయ‌న అభిమానులు చెబుతున్న మాట‌.

ఎక్క‌డో ఆఫ్ దిరికార్డుగానో.. తెర‌చాటుగా సెల్ఫీ వీడియోల్లోనో చెప్పిన మాట కాదు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు అత్యంత ఆగ్ర‌హంతో ఉన్నార‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలోనే క్షేత్ర‌స్థా యి నాయ‌కులు ముక్త‌కంఠంతో చెప్పిన మాట ఇది. దీంతో నాయ‌కుల‌ను , కార్య‌క‌ర్త‌ల‌ను స‌ర్దు బాటు చేయ‌లేక .. ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా.. గుండుగుత్త‌గా.. మెజారిటీ కార్య‌క‌ర్త‌లు , నాయ‌కులు కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. నిజానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో నూ.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌గిరి నియోజ క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. ఈయ‌నకు కార్య‌క‌ర్త‌లు బాగానే స‌హ‌క‌రిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున నారాలోకేష్ పోటీ చేసినా, నంద‌మూరి బాల‌య్య ప్ర‌చారం చేసినా.. ఆళ్ల విజ‌యం ద‌క్కించుకున్నారు.

అదేస‌మ‌యంలో కీల‌క‌మైన దుగ్గిరాల మునిసిపాలిటీని ద‌క్కించుకోవ‌డంలోనూ.. ఆళ్ల‌కు కార్య‌క‌ర్త‌లే అం డ‌గా నిలిచారు. అయితే.. పార్టీలో ఏర్ప‌డిన అంత‌ర్గ‌త విభేదాల కార‌ణంగా.. గ‌త నాలుగేళ్లుగా.. ఆళ్ల వీరిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీనిపై కొన్నాళ్లుగా స‌ర్వేల నుంచి కూడా.. ఆళ్ల‌కు డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నా య‌ని నివేదిక‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అలెర్ట్ అయిన‌.. వైసీపీ అధిష్టానం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ నేప‌థ్యంలోనే కార్య‌కర్త‌లు నిప్పులు చెరిగారు. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్తితి స‌ర్దుకుంటుందా? లేదా? అనేది చూడాలి.