42 చోట్ల కొత్తవారికి ఛాన్స్ ?

తాజాగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొందరు ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అలాంటి ఎంఎల్ఏల పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాకపోయినా వాళ్ళెవరో అందరికీ తెలుసన్నారు. దళితులు, బీసీల అభివృద్ధకి అమలుచేస్తున్న పథకాల్లో కూడా అవినీతికి పాల్పడతారా ? అంటు ఫుల్లుగా క్లాసుపీకారు. అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలంతా రాబంధుల్లాగ పీక్కుతున్నట్లని మండిపడ్డారు.

అవినీతికి పాల్పడ్డవారు తమ పద్దతిని మార్చుకోకపోతే తోకలు కత్తిరించేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్, గొర్రెల పంపిణీతో పాటు అనేక కార్యక్రమాల్లో ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడ్డారని కేసీయార్ వివరించారు. ఏ ఎంఎల్ఏ ఎంత అవినీతికి పాల్పడ్డారనే లిస్టు తన దగ్గర ఉందని గట్టిగా చెప్పారు. కేసీయార్ తాజా వార్నింగ్ చూసిన తర్వాత అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలకు టికెట్లు దక్కేది అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది.

ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావటానికి కేసీయార్ పెట్టుకున్న ఆశలు ప్రధానంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలే. కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల అమల్లోనే ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడటం విచిత్రమనే చెప్పాలి. నిజానికి కేసీయార్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలేవీ అంత గొప్పగా అమలు కావటంలేదు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకాలపై అనేక ఆరోపణలున్నాయి.

సో తాజా డెవలప్మెంట్ నే చూసిన తర్వాత కేసీయార్ వార్నింగ్ ఇచ్చిన 46 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే అవినీతిపరులుగా ఇంత ముద్రపడిన వాళ్ళకే మళ్ళీ టికెట్లిస్తే జనాలు ఓట్లేస్తారా ? అనేది అనుమానం. పైగా పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళపై బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై కేసీయార్ రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటున్నారు. కాబట్టి 42 నియోజకవర్గాల్లో కాకపోయినా మెజారిటి స్ధానాల్లో కొత్త అభ్యర్దులను రంగంలోకి దింపే అవకాశముంది. ఆ విషయం ఇప్పుడే ప్రకటిస్తే గొడవైపోతుందని ప్రకటించుండరంతే.