ఒక్కొక్కసారి రాజకీయాల్లో అంతే. ఒక పార్టీ వేసే వ్యూహాలు.. మరొక పార్టీకి అచ్చుగుద్దినట్టు కలిసి వచ్చేస్తా యి. దీనికి ఏమీ ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. గతంలో 2018లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ పొత్తులు వీరికి కలిసి వచ్చాయో లేదో అందరికీ తెలిసిందే.. కానీ.. పరోక్షంగా మరోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చినట్టు అయింది.
అలానే.. కార్యాకారణ సంబంధం అనేది ఏపీలోనూ కనిపిస్తోంది. వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ అధికారం నిల బెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును ఎదుర్కోనేలా నాలుగు వ్యూహాలను అమలు చేస్తోంది. వీటిలో చంద్రబాబు సభలకు అడ్డంకులు సృష్టించడం.. రెండు చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులను నిలువరించడం. మూడు.. చంద్రబాబు వయో వృద్ధుడు అంటూ ప్రచారం చేయడం.
నాలుగు.. చంద్రబాబు పథకాలను నిలిపివేయడం.ఈ నాలుగు వ్యూహాలు కూడా చాపకింద నీరులాగా.. వైసీపీ అమలు చేస్తూనే ఉంది. తద్వారా.. చంద్రబాబు ఉనికి పోవాలనే వ్యూహం.. వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూకటి వేళ్లతో సహా.. కూల్చి వేయడం ద్వారా.. చంద్రబాబుకు దక్కనున్న అజరామర కీర్తిని ధ్వసం చేశామనే.. అభిప్రాయం వైసీపీకి ఉండి ఉండొచ్చు. అయితే.. అలా క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.
ఇక, వయోవృద్ధుడు అని చంద్రబాబుపై పదే పదే చేస్తున్న ప్రచారం కూడా.. వికటిస్తోంది. వయో ఫ్యాక్టర్‌ను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా.. చంద్రబాబు సీనియార్టీ ఇప్పుడు మరింత అవసరం అనే మాట కూడా వినిపిస్తోంది. అదేవిధంగా విజన్ ఉన్న నాయకుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక, చంద్రబాబు హయాంలో చేపట్టిన పథకాలను నిలిపివేయడం ద్వారా.. ఆయన ఉనికి లేకుండా చేయాలనేది మరో వ్యూహం. అయితే.. ఇది కూడా వికటిస్తోంది. అంటే.. మొత్తంగా వైసీపీ వేసుకున్న చతుర్ముఖ వ్యూహాలు అన్నీ కూడా బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 27, 2023 10:27 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…