పోలీసును కొట్టి కోర్టుకెక్కిన ష‌ర్మిల‌!

ఓ ఎస్సై స్థాయి అధికారి చెంప ఛెళ్లు మ‌నిపించిన ష‌ర్మిల‌.. ఎద‌రు ఆయ‌న‌పైనే కేసు పెట్టి.. కోర్టుకు వెళ్ల‌డం ఇప్పు డు చ‌ర్చ‌కు దారితీసింది. మ‌రోవైపు పోలీసులు కూడా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అధికారిపై చేయి చేసుకు న్నార‌నే ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశారు.

ఏం జ‌రిగింది?

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు  ష‌ర్మిల లోట‌స్ పాండ్‌లోని ఇంటి నుంచి  బయలు దేరింది. అయితే..  ఆమెను పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయినా.. పోలీసుల‌ను తోసిపుచ్చి షర్మిల కారు ఎక్కే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్‌ పై షర్మిల చేయి చేసుకున్నారు. రెండు సార్లు ఛెళ్ ఛెళ్ మ‌ని కొట్టారు.

దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయినా.. కూడా సిట్ కార్యాల‌యానికి ష‌ర్మిల న‌డుచుకుంటూ ముందుకు సాగారు. రంగంలోకి దిగిన‌ పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు.  కాగా, త‌న పట్ల పోలీసుల తీరు సరిగా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లను పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమెను తోసివేసే ప్రయత్నం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన తప్పులేకపోయినా పోలీసులు తనపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్సార్‌టీపీ నేతలు ష‌ర్మిల త‌ర‌ఫున‌ హైకోర్టులో పిటిష‌న్ వేశారు.