అనుకోని డెవలెప్మెంట్లు జరిగితే ఏమిచేయాలి ? ఇపుడిదే విషయమై జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారట. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కుంటే అపుడు ప్రత్యామ్నాయంగా ఏమిచేయాలి అనే విషయాన్ని జగన్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. జగన్ కు అవినాష్ దగ్గర బంధువే కాదు అత్యంత నమ్మకస్తుల్లో ఒకడనే చెప్పాలి. జగన్ తరపున ఇపుడు జిల్లా వ్యవహారాలన్నింటినీ ఎంపీయే చక్కబెడుతున్నారు. జగన్ దగ్గర అవినాష్ మాటకు తిరుగేలేదు.
ఇటు జగన్ కు అటు భారతికి కూడా అవినాష్ దగ్గర బంధువు అవటమే కాకుండా జగన్ కష్టాల్లో ఉన్నపుడు వెన్నంటే ఉన్నారు. అందుకనే అవినాష్ కు జగన్ అంత ప్రాధాన్యతిస్తారు. సరే ప్రస్తుతానికి వస్తే వివేకా హత్య కేసులో అవినాష్ గనుక అరెస్టయితే ఏమిచేయాలి అనేది జగన్ ముందున్న కీలకమైన ప్రశ్న. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని అవినాష్ చెబుతున్నదే నిజమైతే సమస్య లేదు. అలాకాకుండా అవినాష్ పాత్ర కూడా కీలకమే అని సీబీఐ నిరూపించగలిగితే కత మరోరకంగా ఉంటుంది.
అవినాష్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేమీ లేదు. సీబీఐ అరెస్టుచేసినా కొద్దిరోజుల తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. వచ్చే ఎన్నికల్లోగా హత్యకేసులో అవినాష్ ను కోర్టు దోషిగా తేల్చితే మాత్రం సమస్య తప్పదు. అందుకనే ఇప్పటినుండే ప్రత్యామ్నాయాన్ని చూసుకోవటం బెటరని జగన్ అనుకుంటున్నారట. వైసీపీ తరపున ఎవరిని పోటీచేయించినా గెలుస్తారనే దీమా జగన్లో కనబడుతోంది. కాకపోతే భారతిని కానీ మరో దగ్గర బంధువుని కానీ నిలబెడితేనే మంచిదని అనుకుంటున్నట్లు టాక్.
జిల్లాలో వైఎస్ కుటుంబానికున్న పట్టు సంగతి అందరికీ తెలిసిందే. 1989 నుండి కడప పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్ కుటుంబంలో ఎవరు పోటీచేసినా గెలుస్తునే ఉన్నారు. అభ్యర్ధిగా ఎంపికైతే చాలు ఇక ఎంపీగా గెలిచేసినట్లే అనుకోవాలి. ఇలాంటి పరిస్ధితుల్లో భారతి పేరును జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నారట. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారతి పోటీచేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. భారతి పొలిటికల్ ఎంట్రీ వివేకా హత్య కేసు తీర్పు మీద ఆధారపడుంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.