ఆ పార్టీ నేతలు,శ్రేణుల తీరు కూడా ఆరోపణలను బలపరిచేదిగా ఉంటుంది. తాజాగా ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో వైసీపీ రెచ్చిపోయి అరాచకం సృష్టించింది. స్వయంగా మంత్రి అయిన ఎమ్మెల్యే రంగంలోకి దిగి బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నించారు.
ప్లకార్డుల ప్రదర్శన
టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనను అడ్డుకునేందుకు ప్లకార్డులు, నల్లబెలూన్లతో వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. వారికి మంత్రి ఆదిమూలపు సురేష్ నాయకత్వం వహించడమే కాకుండా చొక్కా విప్పి మరీ సవాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఎస్సీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ పెట్టారు.
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు
వైసీపీ శ్రేణులు చంద్రబాబు వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. దానితో కొందరికి గాయాలయ్యాయి. వాహనం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మంత్రి సురేష్ కార్యాలయం ఎదురుగానే వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. మరో పక్క వైసీపీ శ్రేణులను నిలువరించాల్సిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టేశారు. స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేసినట్లు సమాచారం.
కమాండోకు కుట్లు
వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో చంద్రబాబులో సెక్యూరిటీలోని NSG కమాండెంట్ సంతోష్‌కుమార్ తలకు గాయమైంది. దాడి సమయంలో చంద్రబాబుకు రక్షణగా NSG కమాండోస్ నిలిచారు. అదే సమయంలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. వైసీపీ రాళ్ల దాడిలో సంతోష్‌కుమార్ తలకు గాయం అయ్యింది. సంతోష్‌కుమార్‌కు వైద్యులు మూడు కుట్లు వేసి కట్టుకట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates