ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి 72 ఏళ్ల వయసున్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు ఉదయం 7గంటల సమయంలో భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అరెస్ట్ మెమో అందజేసి 120బి రెడ్‌విత్ 302, 201 సెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డి మొబైల్ ఫోన్ ను కూడా సీజ్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
అయితే, సీబీఐ అధికారులు భాస్కరరెడ్డిని ఊరికేనే.. చిన్నచిన్న కారణాలతో అరెస్టు చేయలేదనేది వాస్తవం. సీబీఐ తన రిపోర్టులో అన్నీ పూసగుచ్చినట్టు వివరించింది. ‘రాజకీయం కోసం.. రాజకీయం చేత.. వైఎస్ భాస్కరరెడ్డి దురాలోచన చేశారు’ అని స్పష్టంగా సీబీఐ వివరించింది. వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి పాత్ర స్పష్టంగా ఉన్నట్లు సీబీఐ కుండబద్దలు కొట్టింది. దీనిలో భాగంగానే విచారణ చేపట్టి అరెస్ట్ చేశామని పేర్కొంది.
సీబీఐ చెబుతున్నది ఇదే..
1) వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు(2019 మార్చి 15) తొలుత దాన్ని గుండెపోటుగా ప్రచారం చేయడం, సాక్ష్యాలు చెరిపివేయడంలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉంది. ఈ కేసులో ఆయన ప్రధాన కుట్రదారుడు.
2) హత్యకు ముందురోజు(మార్చి 14) సాయంత్రం వైఎస్ భాస్కరరెడ్డి.. మరో నిందితుడు సునీల్ యాదవ్ ఇంట్లో మంతనాలు జరిపాడు.
3) అప్రూవర్‌గా మారిన వివేకా కారు డ్రైవర్.. దస్తగిరి కదిరి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ వేచిచూశాడు. ఆ సమయంలో తన రెండు ఫోన్లను భాస్కర్‌రెడ్డి స్విచ్ఛాఫ్ చేశారు.
4) వివేకానందరెడ్డి 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయిన తర్వాత భాస్కర్‌రెడ్డి ఇంటికి వివేకా వెళ్లారు. తండ్రీకొడుకులతో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
5) వివేకానందరెడ్డి వైసీపీలో ఉంటే తమకు రాజకీయ ఎదుగుదల ఉండదని భాస్కర్‌రెడ్డి భావించారు.
6) రాజకీయంగా అడ్డుతొలగించుకునేందుకే శివశంకర్‌రెడ్డితో ఆయన ఈ హత్య చేయించి ఉంటారని భావిస్తున్నాం.
7) వివేకానందరెడ్డి వైసీపీలో నెంబర్ 2 పొజిషన్‌కు వెళ్లే అవకాశం ఉందని భాస్కరరెడ్డి భావించారు. ఇదే జరిగితే.. తమకు ఉన్న వ్యక్తిగత వైరం కారణంగా తమ కుటుంబాన్ని వివేకా అణగదొక్కే ప్రయత్నం చేస్తారని అంచనా వేశారు. ముఖ్యంగా తన కుమారుడు అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చని భావించారు.
This post was last modified on April 16, 2023 3:01 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…