మరోసారి అధికారం దక్కించుకుని.. కర్ణాటకలో ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రోజు రోజుకు సెగలు పెరుగు తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడిపోయారు. దీనికి కారణం.. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఇప్పటి వరకు 212 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. వీరిలో సిట్టింగులకు చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు. కొందరికి పార్టీ అధిష్టానం నచ్చజెప్పగా మరికొందరికి మాత్రం ఊరడింపు లభించలేదు. దీంతో వారంతా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఇది పార్టీకి ప్రమాద సంకేతాలు ఇస్తున్నట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. దీని నుంచి ఎలా బయట పడాలనే విషయంపై బీజేపీ పెద్దలు ఆలోచనలు చేస్తున్న సమయంలో మరో ఎదురు దెబ్బతగిలింది. బీజేపీ కీలకనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరుగు బావుటా ఎగుర వేసేందుకు రెడీ అయ్యారు. తనకు టికెట్ ఇచ్చే విషయంపై బీజేపీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్‌కు హెచ్చరికలు చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను పార్టీ కోల్పోవాల్సి వస్తుందని సంచలన ప్రకటన చేశారు.
మాజీ సీఎం శెట్టర్ హుబ్బళి-ధార్వాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఈ టికెట్‌పై పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే.. ఇంకా ప్రకటించాల్సిన 12 స్థానాల్లో ఇది కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ కేటాయింపు అంశంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన శెట్టర్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో శెట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నాకు టికెట్ కేటాయింపుపై పార్టీ నిర్ణయం కోసం ఈ నెల 16 వరకు ఎదురుచూస్తా. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. సీనియర్లకు టికెట్లు నిరాకరించడంపై బీజేపీ పునరాలోచించుకోవాలి. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నాకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలోని చాలా నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని మాజీ సీఎం యడియూరప్ప కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. నాకు టికెట్ ఇవ్వకపోతే.. 20 నుంచి 25 సీట్లు కోల్పోయే అవకాశముంది. రాష్ట్రమంతటా కూడా ఆ ప్రభావం ఉంటుంది’’ అని శెట్టర్ హెచ్చరించడం గమనార్హం. మరి ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 7:15 am
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…
కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ),…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్వీఎస్ ఎస్…