తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతుల్లో ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదోతరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. తెలిసిందే. అయితే.. గురువారం రాత్రి పొద్దు పోయాక ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేశా రు.అ దేసమయంలో కరీంనగర్ పోలీసు కమిషనర్‌పైనా విమర్శలు గుప్పించారు. హిందీ పేపర్ ఎవరైనా లీకు చేస్తారా? అని సంజయ్ ప్రశ్నించారు. ఒక వేళ హిందీ పేపర్ లీకు చేసింది తామైతే.. తెలుగు పేపర్ లీకు చేసింది ఎవరని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలోనే.. లీకు వీరులు, లిక్కరు వీరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్..లు త్వరలోనే జైలుకు పోతారని అన్నారు.
కేసీఆర్‌ను నయాం నిజాంగా అభివర్ణించిన బండి సంజయ్ ఆయనను త్వరలోనే తరిమి కొడతామన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌పైనా విచారణ జరిపించాలని, ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు(టీఎస్ పీఎస్సీ) రూ. లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. లవంగానికి, తంబాకుకు తేడా తెలియనివ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు.
కేసీఆర్ నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని బండి దుయ్యబట్టారు. కేసీఆర్‌పై పోరాటానికి బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఇక, కరీంనగర్ సీపీపైనా బండి విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్‌కు, మాల్ ప్రాక్టీస్‌కు తేడా తెలియడం లేదా? అని నిలదీశారు. సీపీ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి.. తాను చెప్పింది నిజమని చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు లీకేజీతో సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నానని బండి వ్యాఖ్యానించారు. వరంగల్ సీపీపై ధిక్కరణ వ్యాజ్యం వేస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates