వైసీపీ మైండ్‌గేమ్‌కు లొంగొద్దు.. జ‌న‌సేనాని పిలుపు!

Pawan kalyan

ఏపీ అధికార పార్టీ వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరుచుకుప‌డ్డారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడు తోం \ద‌ని.. దానికి చిక్కొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జ‌న‌సేన నేత‌ల‌తో హైద‌రాబాద్‌లో భేటీ అయిన ప‌వ‌న్‌.. ఈ మేర‌కు వారికి కొన్ని విష‌యాల‌ను వివ‌రించిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో పార్టీకి కొన్ని వ్యూహాలు ఉన్నాయ‌ని.. అవ‌న్నీ స్ప‌ష్టంగానే ఉన్నాయ‌ని.. ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలి.. ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త ఉంద‌ని ప‌వ‌న్ పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌బోనంటూ.. గ‌తంలో చెప్పిన మాట‌కు ప‌వ‌న్ క‌ట్టుబ‌డ్డార‌ని.. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ హ‌రిప్ర‌సాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు వివ‌రించారు. ప‌వ‌న్ ఏం చేసినా.. పార్టీ ఫ్యూచ‌ర్‌, పార్టీలో కార్య‌క‌ర్త‌ల కోస‌మేన‌ని పేర్కొన్నారు. అయితే.. వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌బో నంటూ.. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ అనేక రూపాల్లో మైండ్ గేమ్ ఆడుతోంద‌ని ఆయ‌న తెలిపారు.

రెండు రోజుల కింద‌ట టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు స్వ‌యంగా ఒక ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు అభూత క‌ల్ప‌న‌లు సృష్టించార‌ని.. జ‌న‌సేన‌తో మాకు అవ‌స‌రం లేదు.. జ‌న‌సేన‌కు మాతోనే అవ‌స‌రం నఅన్న‌ట్టుగా ఆయ‌న మాట్టాడిన‌ట్టు ఓ వీడియోను సృష్టించి.. పార్టీని దారిత‌ప్పించేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. దీనిని న‌మ్మొద్ద‌ని.. ఇది వైసీపీ ఆడుతున్న రాజ‌కీయ కుట్ర‌, క్రీడ‌ల్లో భాగ‌మేన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్టు హ‌రిప్ర‌సాద్ వివ‌రించారు.

జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ విషయంలో గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావ ద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను పార్టీ నాయకులకు పవన్‌కల్యాణ్ త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు వివ‌రిస్తార‌న్నారు.  ‘రైతుల కష్టాలపై త్వరలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిద్దాం. రాష్ట్రంలో 80 శాతం వరి పంట కౌలు సేద్యం నుంచే వస్తుంది.  అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.