ఏపీలో ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ఇదే విషయంపై మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఇవి రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఇక, ఇప్పుడు తెలంగాణతోపాటు.. ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా.. ముందస్తుకు వెళ్లాలని అనుకుని.. రాజీనామా చేసి, కేబినెట్‌ను రద్దు చేసినా.. కేంద్ర ఎన్నికల సంఘం దానికి దన్నుగా నిలిస్తేనే సాధ్యం అవుతుంది. లేకపోతే.. సమయం వచ్చేవరకు అంటే.. షెడ్యూల్ వరకు కూడా.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
ఇది పూర్తిగా కేంద్రంలో అధికారంలో ఉన్న వారి చేతిలోనే ఉంటుంది. ఈ విషయం గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉన్నప్పటికీ.. మౌనం వహించారు. ప్రభు త్వాన్ని రద్దు చేస్తే.. కేంద్రం రాష్ట్ర పతి పాలనకే మొగ్గు చూపుతుందని అనుకుని.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇక, ఏపీలోనూ సేమ్ ఫార్ములానే అప్లయ్ అవుతుంది.
అయితే.. సీఎం జగన్‌కు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికల విషయంపై మోడీని ఒప్పించాలనేది సీఎం జగన్ ప్లాన్.. అందుకే ఆయన హఠాత్తుగా.. ఢిల్లీ టూర్ పెట్టుకున్నారనేది తాడేపల్లి వర్గాల మాట. వచ్చే ఎన్నికల వరకు కూడా నిధులు సరిపోయే పరిస్థితి లేదు.
ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ననిలిచిపోక ముందే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ప్లాన్‌గా ఉందని కొన్నాళ్లుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలోముందస్తుకు మోడీ అనుమతి తీసుకునేందుకే సీఎం జగన్ ఢిల్లీ టూర్ పట్టారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.