ఏపీ అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెట్రో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల్లో ప్రస్తుతం హైదరాబాద్ ముందు ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే 7000+ స్క్వేర్ కిలోమీటర్ల పరిదిలో హైదరాబాద్ అభివృద్ది చెందుతోందన్నారు.
అయితే.. ఈసందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో హైదరాబాద్ వెనుక బడి ఉండేదని.. దీనికి ప్రధాన కారణం.. గతంలో అమరావతి మెట్రో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో పనులు వేగంగా జరిగాయని చెప్పారు. అది కనుక జరిగి.. ముందుకు వెళ్లి ఉంటే.. హైదరాబాద్ ఖచ్చితంగా రెండో స్థానంలో ఉండేదని.. కానీ, ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాల క్రమంలో అమరావతిలో ఎలాంటి పనులు జరగడం లేదని కేటీఆర్ చెప్పారు.
అమరావతి మెట్రో అర్బన్ డెవలప్‌మెంట్ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ దేవంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మరింతగా హైదరాబాద్‌ను అబివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. అయితే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అమరావతి అభివృద్దికి బారీ ఎత్తున నిధులు కేటాయించి.. పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చేశారు. అయితే.. వైసీపీ వచ్చిన తర్వాత..అమరావతి పనులు నిలిచిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates