కర్నాటకలో బసవరాజ బొమ్మై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ఇప్పటివరకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దుచేసింది. వీళ్ళకు రద్దుచేసిన రిజర్వేషన్లను ఒక్కలిగ, లింగాయత్ లకు సర్దుబాటు చేసింది. ఎన్నికలు మరో రెండునెలల్లో ఉన్నాయనగా రాష్ట్రంలోని ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయటమంటే పెద్ద సంచలనమనే చెప్పాలి. పైగా రాష్ట్రంలో ముస్లింల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలోనే ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయటం అంటే సంచలనమే కాదు పెద్ద సాహసమనే అనుకోవాలి.
ముస్లింలకు రిజర్వేషన్ రద్దుచేయటాన్ని బొమ్మై సమర్ధించుకున్నారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తున్నారు. రద్దుచేసిన 4 శాతం రిజర్వేషన్లను ఒక్కలిగ, లింయాత్ లకు చెరి రెండుశాతాన్ని సర్దుబాటు చేశారు. తాజా సర్దుబాటుతో 2 సీ కేటగిరిలో ఉన్న ఒక్కలిగ రిజర్వేషన్ 4 నుండి 6 శాతానికి పెరిగింది. అలాగే 2 డీలోని లింగాయత్ ల రిజర్వేషన్ శాతం 5 నుండి ఏడుకి పెరిగింది.
ముస్లింలు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా వాళ్ళ వాదన చెల్లుబాటు కానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎలాగంటే ఈడబ్ల్యూఎస్ కేటగరిలో కేంద్రప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ కేటగిరిలోకి బొమ్మై ప్రభుత్వం ముస్లింలను చేర్చింది. అలాగే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ శాతాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. తాజా డెవలప్మెంట్లతో మొత్తంమీద రిజర్వేషన్లు 50 నుండి 56 శాతానికి పెరిగింది.
బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. నిజానికి రిజర్వేషన్లనేవి తేనెతుట్టె లాంటివని అందరికీ తెలిసిందే. ఒకళ్ళకి రిజర్వేషన్ కల్పించినా, మరొకళ్ళకి తగ్గించినా మిగిలిన మతాలు, కులాలు ఊరుకోవు. అందుకనే ఏ ప్రభుత్వం కూడా వీటిజోలికి పోదు. అలాంటిది బొమ్మై ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేయటమంటే మామూలు విషయంకాదు. కర్నాటకలో ముస్లింల జనాభా గణనీయంగానే ఉన్నాయి. 234 సీట్ల రాష్ట్రంలో కనీసం 40 స్ధానాల్లో ముస్లింల ఓట్లు ఫలితాలను నిర్ణయించేంతగా ఉందని ఒక అంచనా. మరి రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.
This post was last modified on March 26, 2023 10:25 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…