ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. రోజు వారిలో ఇరు పార్టీల నేతలు తిట్టుకుంటూనే ఉంటారు. మీరెంత అంటే మీరెంత అన్న రేంజ్ లో తిట్ల దండకం నడుస్తుంటుంది. గత మూడు నాలుగు నెలలుగా ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది.
చంద్రబాబు నాయుడు జనంలోకే వెళ్తూ సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెడ్డటం మొదలు పెట్టిన తర్వాత ఆరోపణాస్త్రాలు వేగం పెరిగాయి. జగన్ కు ఫస్ట్ సైకో అని పేరు పెట్టినది కూడా చంద్రబాబే కావచ్చు. సైకో పోవాలి సైకిల్ రావాల్ రావాలి అన్న నినాదం జనంలోకి బాగానే చేరుకుంది.
యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ఇప్పుడు సీఎం జగన్ కు కొత్త పేరు పెట్టారు. అదే పులకేశి. తమిళ నటుడు వడివేలు నటించిన ఒక సినిమాలో హింసించే పులకేశి అని క్యారెక్టర్ ఉంటుంది. అప్పట్లో ఎవరు ఎవరినైనా ఎగతాళి చేయాలంటే పులకేశి అని పిలిచేవారు.
ఇప్పుడు రాజకీయ వాతావరణం వెడెక్కిన నేపథ్యంలో పులకేశి మళ్లీ గుర్తొచ్చాడు. జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను హిసించే పులకేశి అని లోకేష్ అంటున్నారు. జగన్ ఏ విధంగా జనాన్ని ఏడిపిస్తున్నారో చెబుతూ ఒక్కో మాటకు పులకేశి జోడిస్తూ పోయారు. మీటింగులకు వచ్చిన జనం కూడా ఆ డైలాగులను బాగానే ఎంజాయ్ చేశాయి. జనం మరో మాట కూడా అనుకుంటున్నారు. లోకేష్ ను వైసీపీ వాళ్లు పప్పు అని పిలుస్తున్నందుకు ఇంతకాలానికి ఒక మంచి కౌంటర్ వచ్చిందని వాళ్లు చెప్పుకుంటున్నారు..