వైసీపీ రెబల్ ఎమ్మెల్యే , నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆయన సభకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. రెండో రోజు మాత్రం వచ్చీరావడంతో కాక పుట్టించారు. నెల్లూరు రూరల్ నుంచి నేరుగా గుంటూరుకు వచ్చిన ఆయన రాత్రి అక్కడే బస చేశారు. తర్వాత.. కారులో సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్దకు చేరుకున్నారు.
ఇక, అక్కడ నుంచి ఆయన పాదయాత్రగా బయలు దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. పాదయాత్రలో కోటంరెడ్డి తన నియోజకవర్గంలోని సమస్యలతో కూడిన ప్ల కార్డులను ప్రదర్శించారు. పార్టీ అధికారంలో ఉందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని..కనీసం మురుగు గుంటలో చెత్తను కూడా తీయించే అధికారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుపై కోటంరెడ్డి స్పందించారు. తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు.(టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు వారి అంతరాత్మ ప్రబోధాను సారం వోటు వేయాలన్నారు) వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు.
సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానని కోటంరెడ్డి చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఇప్పుడు నిరసన గళం వినిపిస్తు న్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డులతో లేచి నిలబడతానన్నారు.
ఇదిలావుంటే… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లే తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డు ప్రదర్శనతోనే అసెంబ్లీకి కోటంరెడ్డి వెళ్లారు. మరి లోపల ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 15, 2023 11:40 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…